జాతీయ వైద్య బిల్లుకు వ్యతిరేకంగా గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల ధర్నాకు తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మద్దతు పలికారు. డిమాండ్ల పరిష్కారానికి డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో 3 రోజుల్లో సలహా కమిటీ వేస్తామన్నారు. జూడాల డిమాండ్ల గురించి దిల్లీలో ఎవరిని సంప్రదించాలనే విషయాన్ని చర్చిస్తామన్నారు. ఉద్యమ కోణంలో ఆలోచించకుండా ప్రజలకు వైద్యం అందించే విధంగా వైద్యులు పనిచేయాలన్నారు. జూడాల నిరసన ఆరో రోజుకు చేరుకుంది. బిల్లులో 31వ అధికరణను వ్యతిరేకిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి బిల్లును వెనక్కి తీసుకోవాలని డాక్టర్లు కోరారు.
ఇదీ చూడండి :ఆచార్య జయశంకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: కేటీఆర్