ETV Bharat / state

హెచ్​సీయూ తాత్కాలిక ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్​ అగర్వాల్​ - తెలంగాణ తాజా వార్తలు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తాత్కాలిక ఉపకులపతిగా అత్యంత సీనియర్ ప్రొఫెసర్ అరుణ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు వీసీగా ఉన్న పొదిలె అప్పారావు పదవీకాలం గతేడాది ముగిసింది.

Telangana news
హైదరాబాద్​ వార్తలు
author img

By

Published : Jun 8, 2021, 8:38 AM IST

హెచ్​సీయూ తాత్కాలిక వీసీగా అరుణ్​ అగర్వాల్​ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు వీసీగా ఉన్న పొదిలె అప్పారావు... అరుణ్​ అగర్వాల్​కు బాధ్యతలు అప్పగించి రిలీవ్​ అయ్యారు. మాజీ వీసీ పొదిలె అప్పారావు పదవీకాలం గతేడాదే ముగిసినప్పటికీ... కొవిడ్​ వల్ల విద్యా సంవత్సరం గందరగోళంగా మారడం వల్ల ఆయననే కొనసాగించారు. అయితే తనను రిలీవ్ చేయాలని మాజీ వీసీ అప్పారావు మార్చిలో చేసిన విజ్ఞప్తిని.. రాష్ట్రపతి ఇటీవలే ఆమోదించారు.

దిల్లీ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​ , కంప్యూటర్స్​లో పీహెచ్​డీ పూర్తి చేసిన ప్రొఫెసర్ అగర్వాల్ హెచ్​సీయూలో అత్యంత సీనియర్ ప్రొఫెసర్​గా ఉన్నారు. పూర్తి స్థాయి వీసీని నియమించే వరకు ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: PRC: ఉద్యోగులకు గుడ్​న్యూస్​... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.