ETV Bharat / state

నడి వేసవిలో ఎవెన్యూ ప్లాంటేషన్‌.. పట్టించుకోని గుత్తేదారులు!

హరితహారంలో భాగంగా రహదారుల వెంట మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్‌ఎండీఏలో 100 కిలో మీటర్ల పరిధిలో మూడు వరసల్లో గుబురుగా పెరిగేలా మల్టీలేయర్‌ ఎవెన్యూ ప్లాంటేషన్‌ చేపట్టబోతున్నాయి. ఈసారి టెండర్లు లేకుండా రూ.కోట్ల విలువైన పనులను గుత్తేదారులకు అప్పగించారు. మొక్కలు నాటిన రెండ్రోజులకే చనిపోతున్నా వారు పట్టించుకోకపోవడం గమనార్హం.

Avenue plantation, telangana haritha haram
హైదరాబాద్​లో ఎవెన్యూ ప్లాంటేషన్, తెలంగాణకు హరితహారం
author img

By

Published : Apr 3, 2021, 7:29 AM IST

తెలంగాణకు హరితహారంలో భాగంగా రహదారి పక్కన పచ్చదనాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో అటవీశాఖ, హెచ్‌ఎండీఏ, ఆర్‌ఎండీబీ, ఎన్‌హెచ్‌ఏఐ వంటి సంస్థలు జాతీయ, రాష్ట్ర, ఇతర రహదారుల వెంట మొక్కలు నాటాలని నిర్ణయించాయి. హెచ్‌ఎండీఏలో 100 కిలో మీటర్ల పరిధిలో మూడు వరసల్లో గుబురుగా పెరిగేలా మల్టీలేయర్‌ ఎవెన్యూ ప్లాంటేషన్‌ చేపట్టబోతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం 12 కిలోమీటర్ల మేర పైలట్‌ ప్రాజెక్టు పనులను హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్‌ విభాగం చేపట్టింది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి పనులు చేయాలంటే ముందుగా అంచనాలు తయారుచేస్తారు. ఖర్చు లెక్కిస్తారు. టెండర్లు పిలిచి తక్కువ మొత్తానికి చేసేవారికి ఆ పనిని అప్పగిస్తారు. ఇక్కడ మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. అంచనాలు లేకుండానే, టెండర్లు పిలవకుండానే రెండు కి.మీ. దూరం ఒకరికి చొప్పున ఆరుగురు గుత్తేదారులకు అధికారులు పనులు అప్పగించారు. ప్రస్తుతం బండ్లగూడ జీఎస్‌ఐ నుంచి తట్టిఅన్నారం చెరువుకట్ట వరకు మొక్కలు నాటుతున్నారు.

Avenue plantation, telangana haritha haram
నాటిన రెండు రోజులకే ఎండిన మొక్కలు

మొక్కకు రూ.120-500

ప్రభుత్వ శాఖలు తమ నర్సరీల్లో మొక్కలు పెంచి, వాటినే నాటిస్తుంటాయి. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. పైలట్‌ ప్రాజెక్టులో మాత్రం ఏపీలోని రాజమహేంద్రవరం సమీప కడియం నుంచి మొక్కలు తెప్పించారు. ‘రోడ్డు పక్కన ఖాళీని బట్టి కిలోమీటరుకు నాలుగు నుంచి ఆరువేల వరకు మొక్కలు నాటాలన్నది లక్ష్యం. ఈ లెక్కన 12 కి.మీటర్లకు 60-70 వేల మొక్కలు నాటాల్సి ఉంటుందనేది అంచనా. మొక్క రకాన్ని బట్టి ఒక్కోదాని ధర రూ.120-500 వరకు ఉంటుందని’ ఓ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి చెప్పారు. సరాసరిన మొక్క ధర రూ.200గా లెక్కించినా ఆ ఖర్చే రూ.1.40 కోట్లు దాటుతుంది. వాటిని నాటడం, నీళ్లుపోయడం, సంరక్షణ పనుల ఖర్చు అదనం. మొత్తంగా సుమారు రూ.2-3 కోట్ల విలువైన పనులను అంచనాలు లేకుండా, టెండర్లు పిలవకుండా ఎందుకు చేయించాల్సి వచ్చింది? ఏ ప్రాతిపదికన గుత్తేదారులను ఎంపికచేశారు? అనేవి సమాధానం లేని ప్రశ్నలే.

అత్యవసరం..అందుకే నామినేషన్‌పై ఇచ్చాం

పైలట్‌ ప్రాజెక్టు అమలుకు 15 రోజుల సమయమే ఉంది. టెండర్లు పిలిస్తే ఆలస్యమవుతుంది. అందుకే అనుమతి తీసుకుని నామినేషన్‌పై గుత్తేదారులకు పనులు అప్పగించాం. మొక్కల కొనుగోలు, నాటే పనులకు నిర్ణీత ధరలున్నాయి. ఆ ప్రకారమే చెల్లిస్తాం.

- ప్రభాకర్‌, డైరెక్టర్‌, అర్బన్‌ఫారెస్ట్‌, హెచ్‌ఎండీఏ

నాటుట..ఎండుట కోసమేనా?

ఈ చిత్రం హయత్‌నగర్‌ మండలం తట్టిఅన్నారం నుంచి తారామతిపేట మార్గంలోనిది. పైలట్‌ ప్రాజెక్టు కింద రోడ్డు పక్కన పొదలు, నీడనిచ్చే, పూల మొక్కలు మూడు వరసల్లో నాటుతున్నారు. ‘నాటిన రెండ్రోజులకే మధ్యమధ్యలో చాలా మొక్కలు ఎండిపోయి కన్పించాయి. అనేక మొక్కలు వాడిపోయాయి. ఇదేమిటని ఆరాతీయగా ‘వానాకాలంలో అయితే బతుకుతాయి. ఇంత ఎండల్లో ఎలా బతుకుతాయి?’ అని మొక్కలు నాటుతున్న మహిళా కూలీలు ఎదురు ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎఫ్‌ఆర్‌ఓ విజయభాస్కర్‌ దృష్టికి తీసుకెళ్లగా ‘కడియం నుంచి రవాణా అయ్యే సమయంలో వేర్లు దెబ్బతినడం వల్లనే కొన్ని మొక్కలు వాడిపోయినట్లు చెప్పారు. వాటి స్థానంలో కొత్తవి నాటతామన్నారు.

ఇదీ చదవండి: ఆ విషయంలో అస్సలు రాజీపడట్లేదు: శ్రుతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.