Priyanka Gandhi On Bathukamma: రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు మూడు రోజు ఘనంగా జరుగుతున్నాయి. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు సంప్రదాయ నృత్యాలతో ఆడిపాడుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీ తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియచేశారు.
అంతేకాకుండా బతుకమ్మ పండుగతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ అప్పటి ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. 1978లో ఓరుగల్లులో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో తన నానమ్మ ఇందిరా గాంధీ పాల్గొనడం ఒక మధుర స్మృతి అని తెలిపారు. ప్రకృతిని ప్రేమిస్తూ, పువ్వులను పేర్చి ఊరూ వాడా కలిసి చేసుకునే పండుగగా బతుకమ్మను అభివర్ణించారు. ఈ పండుగ రాష్ట్ర ప్రజలకు సంతోషాన్ని కలుగజేయాలని కోరుకుంటున్నట్టు ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.
-
తెలంగాణా ప్రజలందరికీ, ప్రత్యేకంగా తెలంగాణా ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
1978లో ఓరుగల్లు మహిళలతో మా నానమ్మ శ్రీమతి ఇందిరా గాంధీ గారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి. pic.twitter.com/pcJQSEE1Cf
">తెలంగాణా ప్రజలందరికీ, ప్రత్యేకంగా తెలంగాణా ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 27, 2022
1978లో ఓరుగల్లు మహిళలతో మా నానమ్మ శ్రీమతి ఇందిరా గాంధీ గారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి. pic.twitter.com/pcJQSEE1Cfతెలంగాణా ప్రజలందరికీ, ప్రత్యేకంగా తెలంగాణా ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 27, 2022
1978లో ఓరుగల్లు మహిళలతో మా నానమ్మ శ్రీమతి ఇందిరా గాంధీ గారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి. pic.twitter.com/pcJQSEE1Cf
ఇవీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా సాగుతున్న దేవి శరన్నవరాత్రోత్సవాలు
దూసుకొచ్చిన ఏనుగులు.. చెట్టుపైకి ఎక్కిన రైతు.. గంటన్నర అక్కడే.. చివరికి..