ETV Bharat / state

అమల్లోకొచ్చిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం - ts govt

రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం అమల్లోకి వచ్చింది. సోమవారం నుంచి చట్టం అమల్లోకి వచ్చినట్లు ఉన్నత విద్యాశాఖ జీవో విడుదల చేసింది. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుసరించాల్సిన పూర్తి స్థాయి మార్గదర్శకాలు వారం రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం
author img

By

Published : Jul 16, 2019, 4:47 AM IST

Updated : Jul 16, 2019, 7:30 AM IST

తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ యూనివర్సిటీలు రాబోతున్నాయి. రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రైవేట్​ యూనివర్సిటీల చట్టాన్ని అమల్లోకి తెస్తూ... జీవో జారీ అయింది. గతేడాది మార్చి 28న చట్టసభల ఆమోదం పొందినప్పటికీ... ప్రభుత్వం 16 నెలల తర్వాత ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు, విధివిధానాలపై తుది కసరత్తు జరుగుతోంది. మరో వారంలో వీటిని ఖరారు చేసే అవకాశం ఉంది.

ప్రముఖ సంస్థల ఆసక్తి..

దేశంలో ఇప్పటి వరకు 24 రాష్ట్రాల్లో 334 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం రిలయన్స్, అదానీ వంటి ప్రముఖ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు 2016 నుంచి కసరత్తు జరుగుతోంది. ప్రైవేట్ విశ్వవిద్యాయాల చట్టం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో ప్రకటించారు. ఉన్నత విద్యామండలి 2017లో బిల్లు ముసాయిదా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో కేటీఆర్, తలసాని శ్రీనివాస్​ యాదవ్​తో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ముసాయిదాపై చర్చించింది. చివరకు 2018 మార్చి 28న చట్ట సభల ఆమోదం పొందింది.

భిన్నాభిప్రాయాలు..

రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటును కొందరు వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు స్వాగతిస్తున్నారు. అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఉండవు. తెలంగాణ విద్యార్థులకు 25 శాతం కేటాయించాలని చట్టం స్పష్టం చేస్తోంది. నగరాల్లో 25 ఎకరాలు, మిగిలిన ప్రాంతాల్లో 50 ఎకరాల స్థలం, 50 కోట్ల కార్పస్ ఫండ్ ఉండాలని ముసాయిదా బిల్లులో ఉన్నప్పటికీ... చట్టంలో ఆ విషయాన్ని పొందుపరచలేదు.

యూనివర్సిటీలుగా మారొచ్చు..

యూనివర్సిటీ ఫీజుల నిర్ధరణ కమిటీనే రుసుములు ఖరారు చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కాలేజీలు కూడా ప్రైవేట్ యూనివర్సిటీలుగా మారవచ్చు. వాటి రుసుము మాత్రం ప్రభుత్వ పరిధిలోని ఫీజుల నియంత్రణ కమిటీనే నిర్ణయిస్తుంది. విశ్వవిద్యాలయం మూసివేయాలనుకుంటే ఆరు నెలల ముందు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి.. అప్పటికే చేరిన విద్యార్థుల కోర్సు పూర్తయ్యే వరకూ తప్పనిసరిగా కొనసాగించాల్సి ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీల కులపతి, ఉపకులపతి పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. ఐదేళ్లలోపు కచ్చితంగా న్యాక్ గుర్తింపు పొందాలి.

ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం

ఇవీ చూడండి: వచ్చే ఏడాది దూరవిద్యలో సెమిస్టర్ విధానం

Last Updated : Jul 16, 2019, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.