ETV Bharat / state

'స్కాలర్​షిప్ పరీక్ష పేరిట ఫీజులు వసూలు... చర్యలు తీసుకోవాలి' - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

స్కాలర్​షిప్ పరీక్షల పేరిట ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ట్రస్మా డిమాండ్ చేసింది. కోట్ల రూపాయలు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. లక్డీకపూల్​లోని పాఠశాల విద్యా శాఖ కమిషనర్​కు ఫిర్యాదు చేశారు.

trasma fires on corporate schools, private schools association fires on corporate institutions
స్కాలర్​షిప్ పరీక్షల పేరిట మోసం చేస్తున్నారని ట్రస్మా ఫిర్యాదు, కార్పొరేట్ విద్యాసంస్థలపై ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆగ్రహం
author img

By

Published : Mar 30, 2021, 3:33 PM IST

కార్పొరేట్ విద్యా సంస్థలు స్కాలర్​షిప్ పరీక్షల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయంటూ ట్రస్మా ఆరోపించింది. ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.150 రూపాయలు వసూలు చేస్తూ... కోట్ల రూపాయల అవినీతికి తెర తీశాయంటూ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ లక్డీకపూల్​లోని పాఠశాల విద్యా శాఖ కమిషనర్​కు అసోయేషన్ నాయకులు ఫిర్యాదు చేశారు.

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి పేర్కొన్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ టెస్టులతో ఉపయోగం ఉండదని... అడ్మిషన్లలో రాయితీలు ఇస్తామని చెప్పి మోసాలకు పాల్పడే విషయాన్ని గ్రహించాలని సూచించారు. కరోనా నిబంధనలతో పాఠశాలలు నిర్వహించే విధంగా అనుమతించాలని కమిషనర్​కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పాఠశాలలు మూసేసి ఇప్పటికే ఏడాది గడిచిందని... ఇది ఇంకా ఎక్కువైతే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.

ఇదీ చదవండి: 'కీరాదోస'తో కోరినంత ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.