ETV Bharat / state

కరోనా కష్టాలు: మాటలే.. చేతలేవి! - అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రులు

ఆక్సిజన్‌ శాతం తగ్గడంతో అంబులెన్సులో రాత్రంతా తిరిగినా ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు దొరకని దుస్థితి నెలకొంది. అడిగినంత డబ్బు చెల్లించేందుకు సిద్ధపడకపోవడమే ఇందుకు కారణం. గత్యంతరం లేక గాంధీ, టిమ్స్‌లకు తీసుకెళ్లినా అక్కడ పడక ఇచ్చేందుకు మూడు నాలుగు గంటల సమయం పడుతోంది. ఈలోగా అంబులెన్సుల్లోనే ఆయుష్షు తీరిపోతున్న వారూ ఉన్నారు.

private-hospitals-are-demanding-heavy-fees-for-covid-patients
కరోనా కష్టాలు: మాటలే.. చేతలేవి!
author img

By

Published : May 13, 2021, 12:09 PM IST

కరోనా బారిన పడి స్థానికంగా వైద్యం చేయించుకొన్నా నయం కాకపోగా ఆక్సిజన్‌ స్థాయి 88కి పడిపోవడంతో ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని బుధవారం తెల్లవారుజామున అంబులెన్సులో హైదరాబాద్‌ తీసుకొచ్చారు. మూడు నాలుగు ప్రైవేటు ఆస్పత్రులకు తిరిగారు. వెంటిలేటర్‌ పడకకు రోజుకు రూ.1.50 లక్షలు అవుతుందని ఒకటి, రోజుకు రూ.లక్ష అవుతుందని మరొకటి, ముందుగా రూ.3 లక్షల డిపాజిట్‌ చేయమని ఇంకో ఆసుపత్రి స్పష్టం చేశాయి. అదీ నగదు రూపంలోనేనని మెలికపెట్టాయి. అంత స్థోమత లేదన్నా కనికరించలేదు. ఈలోగా అంబులెన్సులో ఆక్సిజన్‌ సిలిండర్‌ నిండుకోవడంతో చివరికి కొంపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు.

రాజధానిలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి ఇదొక ఉదాహరణ మాత్రమే. చాలా వరకు మానవత్వాన్ని మరిచి డబ్బే ధ్యేయంగా వ్యవహరిస్తున్నాయి. ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ పడకలు ఖాళీగా ఉన్నా పైకి లేవని బుకాయిస్తున్నాయి. రోజుకు రూ.లక్ష ఆపైన చెల్లించడానికి సిద్ధపడే వారిని వెంటనే చేర్చుకొని వైద్యం ప్రారంభిస్తున్నాయి.

వెంటిలేటర్లపై ఉంచితేనే

భాగ్యనగరంలో 3 వేలకు పైగా చిన్నా, పెద్దా ఆస్పత్రులున్నాయి. మూడొంతుల వైద్యశాలల్లో కొవిడ్‌ వైద్యం అందిస్తున్నారు. వీటిలో 5 వేల వరకు పడకలున్నాయి. అధిక భాగం ఆక్సిజన్‌ వసతి ఉన్నవి, మరికొన్ని వెంటిలేటర్‌ పడకలు ఉన్నాయి. పక్షం రోజులుగా వైద్యశాలలను ఆశ్రయిస్తున్న బాధితుల్లో అధికులు ఆక్సిజన్‌ పడకకు గానీ, వెంటిలేటర్‌ పడకకు గానీ వస్తున్నవారే. వీరిలో ఆక్సిజన్‌ స్థాయిలు 80-90 మధ్య ఉండేవారే అధికులు. ఇలాంటివారికి నిమిషానికి 4-8 లీటర్ల ప్రాణవాయువు అందించాలి. కొందరు వెంటిలేటర్లపై ఉంచితేనే బతికి బట్టకట్టే స్థితిలో వస్తున్నారు.

ఇప్పటికే గాంధీ, టిమ్స్‌, కింగ్‌కోఠి, ఛాతీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ తరహా పడకలన్నీ నిండిపోయాయి. చేసేదిలేక ఎక్కువ మంది ప్రైవేటు వైద్యశాలలకే పరుగులు తీస్తున్నారు. పేరొందిన పదిలోపు ప్రైవేటు వైద్యశాలలు గతంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వైద్యం అందిస్తున్నాయి. చాలా వరకు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నాయి. ఇవన్నీ, ప్రభుత్వానికి అందిస్తున్న లెక్కల్లో వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ పడకలు ఖాళీ లేనట్లుగా చూపిస్తున్నాయి. ఖర్చు ఎంతైనా వెనకాడని స్థితిలో వచ్చేవారికి వీటిని కేటాయిస్తున్నాయి. ఈ దృక్పథంతో ఉన్నవి బీమాను ఆమోదించడం లేదు. డెబిట్‌కార్డు చెల్లింపులను నిరాకరిస్తున్నాయి. నగదు ఇస్తేనే సమ్మతిస్తున్నాయి. ఆదాయపు పన్ను తప్పించుకోవడానికే ఇదంతా అని ఓ ఆస్పత్రి యజమాని తెలిపారు.

హైకోర్టు ఆగ్రహించినా..

ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహార శైలిపై రెండు మూడు సార్లు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం విచారణలోనూ ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాటలకే పరిమితమవుతున్నారు. వారు గానీ, విజిలెన్సు అధికారులు గానీ తనిఖీల జోలికి వెళ్లడంలేదు. పొరుగు రాష్ట్రాల్లో దాడులు చేసి చర్యలు తీసుకుంటున్నా ఇక్కడ కదలడంలేదు.

ఇదీ చూడండి: ఇంటింటి సర్వేలో వెలుగులోకి వచ్చిన కరోనా బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.