ETV Bharat / state

freelancing jobs: ఫ్రీలాన్సింగ్‌ ఉద్యోగాల వైపు.. నగర యువత చూపు - ఫ్రీలాన్సింగ్​ ఉద్యోగాలు

freelancing jobs: కొంచెం విషయ నైపుణ్యం.. ఇంకొంచెం సాంకేతికతపై పట్టు ఉంటే చాలు నచ్చిన చోట మెచ్చిన పని చేసేసుకోవచ్చు.. ఆమ్దానీ పెంచేసుకోవచ్చు. వేధించే బాసులుండరు.. పని ఒత్తిడి బాధలుండవు. ఇదే ఫ్రీలాన్సింగ్‌. ఇంటి నుంచే ఒకేసారి విభిన్న వేదికలపై పనులు చేసుకునే ఓ పని సంస్కృతి. బెంగళూరు, దిల్లీలాంటి నగరాల్లో ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉండగా.. హైదరాబాద్‌లో కొవిడ్‌ 1, 2 దశల తర్వాత కాలంలో విస్తృతమైంది. మహమ్మారి దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయిన ఎంతో మంది ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులు దీని ద్వారానే ఉపాధి పొందుతున్నారు.

freelancing jobs
ఫ్రీలాన్సింగ్‌తో ఉపాధి పొందుతున్న నగర ఉద్యోగులు
author img

By

Published : Jan 12, 2022, 10:56 AM IST

freelancing jobs: ఫ్రీలాన్సింగ్‌ ఉద్యోగాల వైపు నగర యువత మొగ్గు చూపుతున్నారు. మహమ్మారి దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయిన ఎంతో మంది ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులు దీని ద్వారానే ఉపాధి పొందుతున్నారు. ఇంటి నుంచే ఒకేసారి విభిన్న వేదికలపై పనులు చేసుకునే అవకాశం ఉండండంతో చాలా మంది ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నియామకాల్లో భాగ్యనగరం ముందంజలో ఉంది.

పనికి తగిన పైసలు
freelancing jobs in hyderabad: ప్రైవేటు సంస్థల్లో ఇచ్చే నెలజీతానికి ఎంత పని చెబితే అంత చేయాల్సి ఉంటుంది. కానీ, ఫ్రీలాన్సింగ్‌లో పనికి నిర్దిష్టమైన చెల్లింపులుంటాయి. ఓ రోజులో 20 పుటల్ని అనువాదం చేయాల్సి ఉంటే దాని వరకే జీతాన్ని పొందొచ్చన్న మాట. ఆన్‌లైన్‌లో ఇలా డైలీ వర్క్‌ వేదికలు చాలానే ఉన్నాయి. ఇందులోనూ సాంకేతిక నైపుణ్యమున్నవారికే ప్రాధాన్యం. కోడర్లు, ప్రోగ్రామర్లు, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లకు మంచి డిమాండ్‌ నడుస్తోంది. 69% నియామకాలు సాంకేతిక నేపథ్యం ఉన్నవారికే దక్కుతుండగా.. వాటిలో 40% ఫ్రీలాన్సర్లే ఉంటున్నారని ఓ ప్రైవేటు సంస్థ అధ్యయనంలో తేలింది.

ఈ రంగాల్లో..
freelancer jobs: టెలీకాలర్లు, డీటీపీ, డేటాఎంట్రీ, టీచింగ్‌, ట్యూటరింగ్‌ వంటి వాటితో పాటు సాంకేతికతాధారిత రంగాల్లో ఈ ఉపాధి ఎక్కువ ఉంది. బ్లాక్‌చైన్‌ ఇంజినీర్లు, ఐఓటీ ఆర్కిటెక్టులు, సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు, ఏఐ ఇంజినీర్లు, ఫుల్‌స్టాక్‌ డెవలపర్లు, క్లౌడ్‌ ఆర్కిటెక్టులు, డేటా సైంటిస్టులు కనీసం ఏడాదికి రూ. 15లక్షల నుంచి రూ.20లక్షల ప్యాకేజీలతో పనిచేస్తున్నారు. అడోబ్‌, ఒరాకిల్‌, ఆక్సెంచర్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు సహా ఈకామర్స్‌ రంగంలో ఫ్లిప్‌కార్ట్‌, మీషో తదితరాల్లోనూ ఈ ఫ్రీలాన్సర్లు భారీగా చేరుతున్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా.. ఈ ఏడాదిలో పలు సంస్థలు కొత్త ఉద్యోగుల్ని చేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని కెరీర్‌నెట్‌ సంస్థ అధ్యయనంలో తేలింది. పదింటిలో 8 సంస్థలు ఆన్‌లైన్‌ నియామకాలు చేపడుతున్నాయి. వీటిలో ఎక్కువ నియామకాలతో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉంది. - మహేశ్‌ బండారి, సినీ నిపుణుడు

త ఐదేళ్లుగా సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ సమయంలో ఎడిటర్‌గా, డైరెక్టర్‌గా నాకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ఫ్రీలాన్సింగ్‌ ద్వారా కొన్ని సంస్థల్లో దారి దొరికింది. పలు వెబ్‌ సిరీస్‌లకు దర్శకత్వం చేయడంతోపాటు ప్రైవేటు పాటల ఆల్బమ్స్‌, లఘు చిత్రాలకు ఎడిటింగ్‌ చేస్తున్నాను.- రమేశ్‌, ఫ్రీలాన్స్‌ టెక్కీ

కొవిడ్‌ తొలి దశకు ముందు రోజూ కార్యాలయానికి వెళ్లి ఒకేచోట కూర్చుని గంటల తరబడి పని చేసినా కోరినంత సంపాదన ఉండేది కాదు. ఇప్పుడు లాక్‌డౌన్‌ ద్వారా ఇంటి నుంచి పని దొరకడంతో ఒకేసారి రెండు వేదికలపై పనిచేస్తున్నాను. యాప్‌ డెవలపర్‌గా రాణిస్తూ మంచి ఆదాయమే వస్తోంది. పైగా ఏ ఒత్తిడీ లేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.