ETV Bharat / state

జీతాలు ఇవ్వడం లేదని మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు - రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు

16 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేసిన ఓ కంపెనీ ఎండీపై పలువురు ఉద్యోగులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని డిక్యూ ఎంటర్​టైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ(యానిమేషన్) ఎండీ తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కమిషన్​ను ఆశ్రయించారు.

private employees complaint on company to nhrc
జీతాలు ఇవ్వడం లేదని మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు
author img

By

Published : Nov 6, 2020, 2:42 PM IST

వేతనాలు ఇవ్వకుండా జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఓ కంపెనీ ఎండీపై ఉద్యోగులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని డిక్యూ ఎంటర్​టైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ(యానిమేషన్) ఎండీ తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని వేడుకున్నారు.

16 నెలలుగా జీతాలు లేక 1400 ఉద్యోగులు రోడ్డున పడ్డామని ఉద్యోగులు వాపోయారు. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి 14 లక్షలు రావాలని పేర్కొన్నారు. ఎండీపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్, కార్మిక శాఖ కమిషనర్, సీసీఎస్​లో ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వేతనాలు అడిగితే వేధింపులకు గురి చేయడమే కాకుండా కంపెనీ నుంచి తొలిగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎండీ పాస్​పోర్టు సీజ్ చేసి అతనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కమిషన్​ను వేడుకున్నారు.

ఇదీ చదవండి: నేడు రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నిరసన కార్యక్రమాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.