ETV Bharat / state

'కేసీఆర్​ సారూ... ఓ మెట్టు దిగి సమస్య పరిష్కరించుండ్రి'

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఓ మెట్టు దిగి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రైవేట్​ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సామ వెంకట్​రెడ్డి కోరారు.

'కేసీఆర్​ సారూ... ఓ మెట్టు దిగి సమస్య పరిష్కరించుండ్రి'
author img

By

Published : Nov 14, 2019, 10:19 AM IST

'కేసీఆర్​ సారూ... ఓ మెట్టు దిగి సమస్య పరిష్కరించుండ్రి'

తెలంగాణ ప్రైవేట్​ ఉద్యోగుల సంఘం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించింది. ప్రైవేట్​ ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్​ కార్యచరణపై జరిగిన సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సామ వెంకట్​రెడ్డి ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు.

కార్మికులెవరూ ఆత్మ బలిదానాలకు పాల్పడవద్దని వెంకట్​రెడ్డి కోరారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు వారి రాజకీయ లబ్ధి వాడుకోవద్దని హితవు పలికారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ కార్మికుల సమస్యలు, ప్రజల అసౌకర్యాలు గుర్తించి పరిష్కార మార్గం చూపాలని కోరారు. అంతేకానీ.. మొండికేయడం తగదన్నారు. ప్రైవేట్​ రంగంలో 75 శాతం స్థానికులకు రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.