ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా చల్లపల్లి శ్రీచైతన్య టెక్నో స్కూల్‌లో విద్యార్థిపై ప్రిన్సిపాల్ చేయిచేసుకున్నారు. కుంపటి మౌళికుమార్ చల్లపల్లి శ్రీచైతన్య స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. పుస్తకంలో పేపర్ చింపాడన్న కోపంతో ప్రిన్సిపాల్ సురేష్ ఆ బాలుణ్ని చితకబాదినట్లు విద్యార్థి తరఫువారు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపాల్ సురేష్‌పై పోలీసుస్టేషన్‌లో విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేశారు. మౌళికుమార్‌కు ప్రస్తుతం చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి: బేగంపేటలో తల్లీ పిల్లలు అదృశ్యం...