భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ పురోగతిని పరిశీలించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. హకీంపేట వైమానిక స్థావరానికి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం సుమారు 12.55కి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి నగరశివార్లలోని జినోమ్‌వ్యాలీలో గల భారత్ బయోటెక్ సంస్థకు వెళ్తారు.
కరోనా టీకా అభివృద్ధి, ఉత్పత్తిని ప్రధాని మోదీ పరిశీలించి పురోగతి పనులను సమీక్షిస్తారు. భారత్ బయోటెక్ యాజమాన్యం, శాస్త్రవేత్తలతో మాట్లాడతారు. అక్కడాయన సుమారు గంటసేపు గడుపుతారు.
ప్రధాని మోదీ షెడ్యూలు
- మధ్యాహ్నం 12.55కు హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని మోదీ
- 1 గంటకు రోడ్డు మార్గం ద్వారా భారత్ బయోటెక్‌కు పయనం
- 1.25కు భారత్ బయోటెక్ చేరుకోనున్న ప్రధాని
- 1.25 నుంచి 2.10 వరకు భారత్ బయోటెక్ సందర్శన
- 2.15 కు భారత్ బయోటెక్ నుంచి హకీంపేట విమానాశ్రయానికి తిరుగు పయనం
- 2.40 హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని
- 3.50 హకీంపేట నుంచి పుణె బయల్దేరనున్న మోదీ
ఇదీ చదవండి: 'డిప్యూటీ స్పీకర్ సాబ్.. కాంగ్రెస్‌కు మీ ఓటేయండి.!'