ETV Bharat / state

Modi Congrats Bandi sanjay: బండి సంజయ్​కు మోదీ ఫోన్.. బాగా పని చేస్తున్నారంటూ ప్రశంస

Modi Congrats Bandi sanjay: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను ప్రధాని మోదీ అభినందించారు. పార్టీ కోసం మీరు చాలా కష్టపడుతున్నారని ప్రశంసించారు. ఈ మేరకు సంజయ్​కు ఫోన్ చేసిన మోదీ.. ప్రజా సంగ్రామ యాత్ర జరిగిన తీరును కొనియాడారు. యాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు అభినందనలు తెలపాలని ప్రధాని సూచించారు.

Modi Congrats Bandi sanjay
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను ప్రధాని మోదీ
author img

By

Published : May 16, 2022, 9:49 AM IST

Modi Congrats Bandi sanjay: ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్‌ చేశారు. ‘పార్టీ కోసం బాగా పనిచేస్తున్నారు. శెభాష్‌ బండి..’ అంటూ ప్రశంసించారు. ప్రజా సంగ్రామ యాత్ర జరిగిన తీరు, తుక్కుగూడ సభ గురించి ఆరా తీసి సంజయ్‌ని అభినందించారు. రెండో విడత యాత్రను శనివారం పూర్ తిచేసుకున్న సంజయ్‌.. సాయిగణేశ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్తుండగా ప్రధాని నుంచి ఫోన్‌ వచ్చింది. పాదయాత్రలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందని ప్రధాని అడిగారు. యాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు అభినందనలు తెలపాలని సూచించారు.

'రెండు విడతల్లో కలిపి 770 కిలోమీటర్లు నడిచా. మీ స్ఫూర్తితో.. మీ సూచనలతోనే పాదయాత్ర చేపట్టా. నడిచింది నేనైనా నడిపించింది మీరే.. మీరు చెప్పిన ‘సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌ కా ప్రయాస్‌’ పాలన రాష్ట్రంలో తెచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నానని బండి సంజయ్ ప్రధానికి వివరించారు. కేసీఆర్‌ పాలనపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని వెల్లడించారు. తెలంగాణలోనూ మీలాంటి నీతివంతమైన పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అమిత్‌ షా, జేపీ నడ్డాల రాకతో కార్యకర్తల్లో జోష్‌ పెరిగిందని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

'యాత్ర' విజయవంతం... పెద్దమ్మ తల్లి సన్నిధిలో బండి సంజయ్‌

karnataka Paddy seize: భారీగా వరి ధాన్యం సీజ్.. 16 లారీలు పట్టివేత

కాంగ్రెస్​ 'సమైక్య యాత్ర'.. కన్యాకుమారి టూ కశ్మీర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.