ఆలయాల్లో పూజలు చేస్తూ.. ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలోనే ఉండే పురోహితులు.. క్రికెట్ మైదానంలో సిక్సర్లతో చెలరేగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పురోహితుల కోసం.. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఎస్ఆర్కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్ పోటీలు.. ఉత్సాహంగా సాగుతున్నాయి.
ఏపీలోని వివిధ ప్రాంతాలతో పాటు తెలంగాణ నుంచి మొత్తం 19 జట్లు.. టోర్నమెంట్ లో పాల్గొన్నాయి. ఈ నెల 27 వరకూ ఈ పోటీలు నిర్వహించనున్నట్లు.. నిర్వాహకులు తెలిపారు. విజేత జట్టుకు 60 వేల రూపాయలు, రెండో స్థానం సాధించిన జట్టుకు 30 వేలు బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
- ఇదీ చదవండి : స్వచ్ఛ నగరంగా భాగ్యనగరం : మంత్రి కేటీఆర్