ETV Bharat / state

జాతీయ పతాకం రూపకల్పన తెలుగు జాతికి గర్వకారణం..

ప్రతి భారత పౌరుడు ఉప్పొంగిన గుండెలతో వందనం చేసేది రెపరెపలాడే ఆ మువ్వన్నెల జెండాకే. భారత జాతి ఆశల్ని, ఆశయాల్ని ప్రతిబింబించే ప్రకాశవంతమైన వర్ణాల కలయికే మన త్రివర్ణపతాకం. కాషాయం దేశంపట్ల ప్రజల త్యాగాన్ని, ఆత్మస్థైర్యాన్ని సూచిస్తుంటే.. శ్వేత వర్ణం శాంతికి చిహ్నంగా నిలుస్తోంది. ఆకుపచ్చ ప్రకృతిని, పాడిపంటలను ప్రతిబింబిస్తుంది. మధ్యలో మెరిసే అశోక చక్రం.. నిజాయతీకి ప్రతీకగా ఉంటుంది. అందుకే ఆ మూడు రంగుల జెండా జాతీయ పతాకంగా గుర్తింపు పొందిన నాటి నుంచి దేశప్రజల గుండెల్లో జాతీయస్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనికి గుర్తుగా చెప్పుకునే ఆ పతాక రూపకర్త గురించి మాత్రం దేశం పట్టించుకోవడం మానేసింది. ప్రతి భారతీయుడు సగర్వంగా ఇది మాది అని చెప్పుకునేలా మువ్వన్నెల జెండాను తయారు చేసిన స్వాతంత్ర సమరయోధుడు, స్వచ్ఛమైన తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య. మువ్వన్నెల పతాక కాంతి ఖండాంతరాలే కాకుండా అంతరిక్షంలోకి సైతం దూసుకుపోతోంది. కానీ దాని రూపకర్త పేరు తెలుగు నేల దాటి ముందుకు వెళ్లలేదెందుకో?

Pride of india
జాతీయ పతాకం రూపకల్పన తెలుగు జాతికి గర్వకారణం..
author img

By

Published : Mar 30, 2021, 9:18 AM IST

1921 ఏప్రిల్ 13వ తేదీ యంగ్ ఇండియాలో మహాత్మాగాంధీ ఇలా రాశారు..

"ఏకైక జాతీయ పతాకం కోసం తాము సర్వస్వం త్యాగం చేయడానికి సంసిద్ధులై ఉండాలన్న విషయాన్ని మనం విస్మరించకుండా ఉండటం ఎంతో అవసరం. ఇతర జాతులకుండే పతాకాల ఉద్దేశ్యాలను, ఆశయాలను వర్ణిస్తూ, భారతదేశానికి 30 రకాల జండాలను పురమాయిస్తూ శ్రీ పింగళి వెంకయ్య అమూల్యమైన పుస్తకాన్ని భారత ప్రజాలకందచేశారు. వీరు బందరు ఆంధ్రజాతీయ కళాశాలలో ఉంటూ, కొన్ని సంవత్సరాల నుండి జాతీయ పతాక ఆవశ్యకతను గూర్చి ఎంతో ఉత్సాహంతోనూ, పట్టుదలతోను పనిచేస్తున్నారు.

1921లో బెజవాడలో జరిగిన జాతీయ మహాసభలో వెంకయ్యని పిలిచి ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులు కలిపి, మధ్య రాట్నము చిహ్నంగా గల నిరాడంబరమైన జెండా ఒకటి చిత్రించి ఇవ్వమని అడిగాను. వారి అకుంఠిత ఉత్సహ ఫలితమే నేడు మనకున్న త్రివర్ణ పతాకం" అనేది నాడు బాపూజీ ఉద్ఘాటన.

మహాత్మాగాంధీ 1921లో రాసిన ఈ వ్యాఖ్యలు త్రివర్ణ పతాకం ఆంధ్రదేశంలోనే పుట్టిందని, మన జాతికొక ప్రత్యేక పతాకం కావాలన్న ఆలోచన ప్రప్రథమంగా తెలుగు వానికే కలిగిందని తెలియచేస్తోంది. ఇది తెలుగుజాతికి గర్వకారణం.

జాతీయ పతాకం గౌరవం కోసం స్వాత్రంత్రోద్యమంలో ఎందరో తమ ప్రాణాలను బలిపెట్టారు. స్వరాజ్యోద్యమానికి వెన్నుముకగా నిలిచిన పతాక శత వార్షికోత్సవాలు దేశమంతటా గర్వదాయకంగా జరుపుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశ 75వ వార్షికోత్సవాలలో భాగంగా, జాతీయ పతాక శత వార్షికోత్సవాలు ఘనంగా జరిపించాలి.

భారతావనికి జాతీయ జెండా రూపశిల్పి.. స్వతంత్ర భారత స్ఫూర్తికి.. పర్యాయపదంగా మారిన త్రివర్ణ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య. ఆ మహనీయుడు కృష్ణా జిల్లా వాసి. కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో 1878, ఆగస్టు రెండో తేదీన హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. ఆయన ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసుకుని సీనియర్‌ కేంబ్రిడ్జ్‌ చేయడానికి కొలంబో వెళ్లారు. చొరవ, సాహసం మూర్తీభవించిన ఆయన ముంబయి వెళ్లి 19వ ఏట సైన్యంలో చేరారు. దక్షిణాఫ్రికాలో బోయర్‌ యుద్ధంలో పాల్గొన్నారు. లాహోర్‌లోని ఆంగ్లో వేద పాఠశాలలో సంస్కృత, ఉర్దూ, జపనీస్‌ భాషలు అభ్యసించారు. ఆయన భావజాలవేత్త, భాషావేత్త, భూవిజ్ఞాన శాస్త్రవేత్త, రచయితగా బహుముఖ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించేవారు. 1913లో ఆయన జపనీస్‌ భాషలో పూర్తి నిడివితో ప్రసంగించి అందరి ప్రశంసలందుకున్నారు. అందుకే ఆయనకు జపాన్‌ వెంకయ్య, పత్తి వెంకయ్య అనే పేర్లతో పిలిచేవారు.

19 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడే పింగళి వెంకయ్య ఆఫ్రికాలో మహాత్మాగాంధీని తొలిసారి కలిశారు. అప్పటి నుంచి 50 ఏళ్లపాటు వారి అనుబంధం కొనసాగింది. పింగళి వెంకయ్య గాంధేయ సూత్రాలపై నమ్మకంతో మహాత్ముడిని కలిశారు. 1918-1921 మధ్య జరిగిన కాంగ్రెస్‌ సెషన్స్‌లో వెంకయ్య పాల్గొని భారతీ యులకు సొంత జెండా ఉండాల్సిన ఆవశ్యకతపై ప్రస్తావించారు. అప్పటికి ఆయన మచిలీపట్నంలోని ఆంధ్ర నేషనల్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేస్తున్నారు. మరోసారి విజయవాడలో గాంధీని కలిసినప్పుడు తాను రూపొందించిన జాతీయ జెండాను వివిధ డిజైన్లలో చూపించారు. వాటిని చూసి అంగీకరించిన మహాత్ముడు.. 1921లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో మరో కొత్త డిజైన్‌ను రూపొందించాలని పింగళి వెంకయ్యకు సూచించారు. తొలుత కుంకుమ, ఆకుపచ్చ రంగులతో జాతీయ జెండాను రూపొందించిన వెంకయ్య తర్వాత దాని మధ్యలో తెలుపు రంగును జోడించి మధ్యలో చక్రం పొందుపర్చారు. ఈ మూడు రంగుల జెండాను 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో మహాత్మగాంధీ ఆమోదించారు. జాతీయజెండా తొలిసారి ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలోనే రెపరెపలాడింది.

1921లో బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో గాంధీజీ వెంకయ్యను పిలిపించి జాతీయ జెండాలో కాషాయం, ఆకుపచ్చ, రాట్నం గల జెండాను రూపొందించాలని సూచించారు. ఆ తర్వాత.. శ్వేత వర్ణం కూడా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గాంధీని అభిప్రాయం మేరకు మధ్యలో రాట్నం చిహ్నం కలిగిన మూడు రంగుల జెండాను రూపొందించి గాంధీజీకి అందజేశారు వెంకయ్య. ఆనాడు సమావేశం జరిగిన ఆ ప్రాంగణమే విక్టోరియా మ్యూజియంగా పిలవబడే నేటి బాపు మ్యూజియం. ఆ నాటి సమావేశాలకు గుర్తుగా బాపు మ్యూజియంలో పింగళివెంకయ్య గాంధీకి జాతీయ జెండాను బహూకరించిన ఘట్టాన్ని పాలరాతితో ఏర్పాటు చేశారు. 1947, జూలై 22న భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ.. త్రివర్ణ జెండాలోని రాట్నం స్థానంలో... అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. పింగళి వెంకయ్య గొప్పతనం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఆంధ్ర లయోల కళాశాల విశ్రాంత అధ్యాపకులు, రచయిత డాక్టరు వెన్నా వల్లభరావు పుస్తకాలు రచించారు.

పింగళి వెంకయ్య.. తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. యావత్ భారతం కీర్తించదగిన పేరు కూడా. కానీ స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచిపోయినా ఆ మహనీయుడికి మాత్రం తగిన గౌరవం లభించలేదు. జాతీయ స్థాయిలో మువ్వన్నెల పతాక రూపకర్త గురించి ప్రస్తావన లేదు. కనీసం ఇప్పటికైనా ఆ భరతమాత ముద్దు బిడ్డకు గుర్తింపు రావాలని ప్రతి తెలుగు గుండె కోరుకుంటోంది. ఏటా ఆగస్టు 15న జెండా పండుగను జరుపుకుంటున్నాం. కానీ ఆ జెండా రూపొందించిన వ్యక్తి జయంతి అదే నెలలో ఉందని మాత్రం చాలా రాష్ట్రాలకు తెలియదు. కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో 1876 ఆగస్టు 2న పింగళి వెంకయ్య జన్మించారు. చిన్నతనం నుంచి దేశభక్తి నింపుకున్న పింగళి వెంకయ్య.. 19ఏళ్ల ప్రాయంలోనే.. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధం లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే మహాత్మా గాంధీతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ అనుబంధం అర్ధశతాబ్దం పాటు నిలిచింది. ఉద్యమాల్లో పాల్గొంటున్న తరుణంలోనే పింగళి వెంకయ్య.. భరతదేశానికో జాతీయ జెండా ఉండాలని తపించారు. ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై జాతీయ జెండా ఎలా ఉండాలనే దానిపై చర్చించేవారు. 1916లో భారతదేశానికో జాతీయ జెండా పేరుతో ఓ ఆంగ్ల పుస్తకాన్ని సైతం రచించి ప్రచురించారు. 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు.

1963లో మరణించిన పింగళి వెంకయ్య స్వాతంత్య్ర ఉద్యమంలో చేసిన పోరాటాల కంటే జాతీయ జెండా రూపశిల్పిగానే జాతి ఏటా గర్వంగా గుర్తు చేసుకుంటోంది. 2009లో ఆయన జ్ఞాపకార్థం తపాళా బిళ్లను జారీ చేశారు. ఆయనకు భారతరత్న బిరుదు ఇవ్వాలని 2012లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిఫార్సు చేసింది. పింగళి వెంకయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఆయన పేరు మీద అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. జాతీయ జెండాను రూపొందించిన వ్యక్తి చరిత్ర కనుమరుగైపోతుందన్న ఆవేదన హైదరాబాదుకు చెందిన కె.హెచ్‌.ఎస్‌.జగదాంబ.. పింగళి వెంకయ్య స్మారక ట్రస్టును స్థాపించి చరిత్రను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా.. అతని పేరు మీద అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య పేరును ప్రతి భారతీయుడు తలచుకోవాలి. భారతరత్న ఇవ్వానేది అందరి ఆకాంక్ష. మార్చి 31, ఏప్రిల్‌ 1 తేదీలను జాతీయ పర్వదినాలుగా ప్రకటించాలని డిమాండ్‌ ఉంది.

ఇదీ చదవండి: ఏప్రిల్‌ 1న కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.