గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో శాసనసభ, శాసన మండలి ప్రాంగణాల్లో మీడియా సమావేశాలను నిషేధిస్తూ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి నియమావళి ముగిసేవరకు మీడియాతో సమావేశాలు కానీ, బ్రీఫ్స్ కానీ, పరస్పర సమావేశాలు కానీ నిర్వహించరాదని అందులో స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంతకాలం శాసనసభ్యులు, మండలి సభ్యులు నిర్వహించే మీడియా పాయింట్స్‌ను కూడా మూసివేస్తున్నట్లు కార్యదర్శి తెలిపారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించారు. సంబంధిత విభాగాలన్నీ ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: బండి సంజయ్ ఆరోపణలను ఖండించిన మంత్రి కేటీఆర్