ETV Bharat / state

జర్నలిస్టులకు రూ.20 లక్షల బీమా వర్తింపజేయాలి: అల్లం - జర్నలిస్టులందరికీ కరోనా వైద్య పరీక్షలు

జర్నలిస్టులందరికీ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ను కోరారు. బీఆర్కే భవన్​లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల్ రాజేందర్​ను కలిసిన అల్లం.. వినతి పత్రాన్ని అందజేశారు.

'మంత్రి గారూ! జర్నలిస్టు సమస్యలు పరిష్కరించండి'

author img

By

Published : Jun 8, 2020, 8:42 PM IST

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పాత్రికేయుల సమస్యలపై ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​తో భేటీ అయ్యారు. విధి నిర్వహణలో పాత్రికేయులు వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోందని అకాడమీ ఛైర్మన్ మంత్రికి తెలిపారు. విధిగా జర్నలిస్టులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆయన కోరారు. టీవీ-5 పాత్రికేయుడు మనోజ్ కుమార్ విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారిన పడి ఆకస్మికంగా మృతి చెందినట్లు మంత్రికి వివరించారు.

ప్రతి జర్నలిస్టుకు పీపీఈ కిట్లు ఇవ్వాలి...

ప్రతి జర్నలిస్టుకు కరోనా కిట్ (మాస్క్, శానిటైజర్, పీపీఈ కిట్, గ్లౌజ్) సరఫరా చేయాలని అల్లం నారాయణ మంత్రిని కోరారు. పాత్రికేయులకు జారీ చేసిన హెల్త్ కార్డులను అన్ని ఆరోగ్య సమస్యలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య పరీక్షలకు కూడా ఇది వర్తించే విధంగా చూడాలన్నారు.

అత్యవసర సేవల్లో జర్నలిజం !

అత్యవసర సర్వీసులైన వైద్యం, పారిశుద్ధ్యం, పోలీసులతో సమానంగా జర్నలిస్టులు కూడా ప్రతి క్షణం కరోనా వార్తలపై ప్రజలకు ప్రామాణిక సమాచారం అందిస్తున్నారన్నారు. పత్రికలు, ఛానెళ్లలలో పని చేసే జర్నలిస్టులు గురుతర బాధ్యతను నిర్వహిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రూ.20 లక్షల బీమా...

జర్నలిస్టులకు రూ.20 లక్షల ప్రమాద భీమా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలన్నీ సావధానంగా విన్న మంత్రి ఈటెల రాజేందర్ సానుకూలంగా స్పందించారని అల్లం నారాయణ పేర్కొన్నారు.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి..

జర్నలిస్టులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. వైరస్ సోకకుండా అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి జర్నలిస్టులకు సూచించినట్లు అకాడమీ ఛైర్మన్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.