ETV Bharat / state

నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి - PRESIDENT Ram Nath Kovind NEWS

శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కుటుంబ సమేతంగా నేడు తిరుమలకు రానున్నారు. రాష్ట్రపతి పర్యటనకు తితిదే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న రాష్ట్రపతికి గవర్నర్‌, ముఖ్యమంత్రి స్వాగతం పలకనున్నారు.

నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి

author img

By

Published : Nov 24, 2020, 6:39 AM IST

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్‌ ఇవాళ తిరుమలలో పర్యటించనున్నారు. నేడు ఉదయం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకోనున్న ఆయనకు గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి నేరుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్లనున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుమల వెళ్తారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ స్వామివారిని దర్శించుకోనుండగా... సీఎం జగన్ మాత్రం రేణిగుంట నుంచే తిరిగి విజయవాడ రానున్నారు. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పర్యటనలో పాల్గొననున్నారు.

రాష్ట్రపతి తిరుమల పర్యటన దృష్ట్యా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి పర్యటన ముగిసే వరకు తిరుపతిలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు.

ఇదీ చదవండి: ఆకర్షణీయ హామీలతో తెరాస జీహెచ్​ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.