తెలుగు రాష్ట్రాల్లో వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్... సానుభూతి తెలిపారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌లతో ఫోన్‌లో మాట్లాడిన రాష్ట్రపతి.... వరద పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ కష్ట సమయంలో దేశం మొత్తం తెలంగాణ ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.
ప్రధాని ఆరా...
తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. కుండపోత వర్షాల నేపథ్యంలో... తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు చేపడుతున్న సహాయ చర్యలకు కేంద్రం మద్దతు ఉంటుందని... ఇరు రాష్ట్రాలకు అవసరమైన సాయం చేస్తామని మోదీ భరోసానిచ్చారు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన బాధితులపైనే.... తన ఆలోచలన్నీ ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు.
రాహుల్ విచారం...
తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చిన రాహుల్.. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వరదల్లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని రాహుల్ ప్రార్థించారు.
ఇవీ చూడండి: 'ముంపు బాధితుల కోసం సెంటర్హోం ఏర్పాటు చేస్తాం'