ETV Bharat / state

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ న్యూస్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన రాష్ట్రపతికి.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌, జగన్‌ స్వాగతం పలికారు. అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

president of India visit Tirumala
తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
author img

By

Published : Nov 24, 2020, 12:56 PM IST

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఒకరోజు పర్యటన కోసం తిరుమల వచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్​ గవర్నర్‌ బిశ్వభూషణ్‌, ఏపీ సీఎం జగన్‌ స్వాగతం పలికారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వేద సత్కారం అందుకున్నారు.

రాష్ట్రపతి వెంట గవర్నర్ బిశ్వభూషణ్ ఉన్నారు. కాసేపట్లో వరాహస్వామిని దర్శించుకుని.. అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి చెన్నై తిరిగి పయనమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుపతిలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.