ETV Bharat / state

ఆదివాసీలకు అమలు చేస్తున్న పథకాలపై రాష్ట్రపతి సంతృప్తి.. అభినందనల వెల్లువ

President Draupadi Murmu ongoing visit to Telangana: ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతృప్తి వ్యక్తంచేశారు. తెలంగాణలో ఆదివాసీలకై.. చేపడుతున్న కార్యక్రమాలపై గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతితో కలిసి రాష్ట్రపతి సమీక్షించారు. స్త్రీలు అన్ని రంగాల్లో.. సత్తా చాటుతున్నారన్న ద్రౌపదీ ముర్ము అమ్మాయిలు మరింత మందికి ఉపాధి కల్పించేస్థాయికి ఎదగాలని సూచించారు.

president
పథకాలు భేష్​
author img

By

Published : Dec 29, 2022, 10:22 PM IST

పథకాలు భేష్​

President Draupadi Murmu ongoing visit to Telangana: ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుసుకున్నారు. ఆదివాసీలు, ప్రత్యేకించి బలహీన గిరిజన సమూహాలు - పీవీటీజీల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, అధికారులు పాల్గొన్నారు. పీవీటీజీ సభ్యులు, విద్యార్థులతో మాట్లాడిన రాష్ట్రపతి విద్య, వైద్యం, తాగు, సాగునీరు, కనీస మౌలిక వసతులపై.. ఆరా తీశారు. గిరిజనులకు రైతుబంధు, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి కల్పిస్తున్నట్లు రాష్ట్రపతికి అధికారులు తెలిపారు. ఆదిమ గిరిజన తెగల ప్రాంతాల్లో 31 పాఠశాలలు, ప్రత్యేక ప్రాథమిక, సైనిక పాఠశాలలు, న్యాయవిద్య, ఫైన్ ఆర్ట్స్ కొరకు ప్రత్యేక కళాశాలలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆదివాసీల అభివృద్ధి కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.

అంతకుముందు హైదరాబాద్‌లో నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలను రాష్ట్రపతి సందర్శించారు. సమాచార, శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళలు.. మరింత ముందంజ వేయాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. రజతోత్సవాలను జరుపుకుంటున్న మహిళా కళాశాలను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా గోల్డ్ మెడల్స్ సాధిస్తున్నారని హర్షం వ్యక్తంచేశారు. బాలికల పట్ల తల్లిదండ్రులు భేదభావం చూపకూడదని.. వారికి అండగా నిలవాలని కోరారు. అమ్మాయిలు ఉద్యోగం సాధించడమే కాకుండా.. మరింత మందికి ఉపాధి కల్పించేస్థాయికి ఎదగాలని రాష్ట్రపతి సూచించారు.

"ఇంటి పనులవల్ల అనేకమంది స్త్రీలు తమ వృత్తి,ఉద్యోగాల్లో కొనసాగలేకపోతున్నారు. మీ వృత్తి, ఉద్యోగాల్లో రాణించేందుకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలని కోరుతున్నాను. విద్యార్థులారా మీ సొంత విజయం, సంతోషంతో.. సంతృప్తి పడిపోకండి. మానవత్వంతో దేశ ప్రగతికి కృషి చేయండి. మీ ప్రతిభ, సాంకేతిక సామర్థ్యాలను అతి పెద్ద మంచి పనికి ఉపయోగించండి. సాంకేతిత ఫలాలు మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు అందాలి. సాంకేతికతను సామాజిక, ఆర్థిక, డిజిటల్‌ అంతరం తగ్గించేందుకు ఉపయోగించాలి." - ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి

శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో కొలువైన శ్రీ రామానుజాచార్య సమతామూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. ఆధ్యాత్మిక క్షేత్రం విశేషాలను చినజీయర్‌ స్వామి ద్రౌపది ముర్ముకు వివరించారు. సమతామూర్తి సన్నిధిలో కలియతిరిగిన రాష్ట్రపతి 108 దివ్యక్షేత్రాలను వీక్షించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.