ETV Bharat / state

ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం...హైకోర్టుకు నివేదించిన ఎస్​ఈసీ - ఏపీలో స్థానిక ఎన్నికలపై ఎస్​ఈసీ

ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హైకోర్టులో అదనపు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఏపీలో బ్యాలెట్ బాక్సుల కొరత ఉందని... దక్షిణాది రాష్ట్రాల నుంచి తెచ్చుకునే అవకాశాన్ని పరిశీలించినా ఫలప్రదం కాలేదన్నారు. వాటి లభ్యత ఆధారంగా వివిధ దశల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేస్తామని పేర్కొన్నారు.

preparing-for-the-conduct-of-local-elections-dot-dot-dot-sec-reported-to-the-ap-high-court
స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం...హైకోర్టుకు నివేదించిన ఎస్​ఈసీ
author img

By

Published : Nov 4, 2020, 10:07 AM IST

ఆంధ్రప్రదేశ్​లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్‌, మరొకరు గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఇటీవల విచారించిన ఏపీ హైకోర్టు... ఎస్​ఈసీకి నోటీసులిచ్చింది. రమేశ్‌కుమార్‌ మంగళవారం అదనపు అఫిడవిట్‌ దాఖలు చేశారు. స్థానిక ఎన్నికలపై అభిప్రాయ సేకరణకు వివిధ రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీకి... 19 పార్టీలను ఆహ్వానించగా... 11 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారని కోర్టుకు తెలిపారు. 2 పార్టీలే రాతపూర్వకంగా అభిప్రాయం తెలియచేస్తామని చెప్పాయన్నారు. 6 పార్టీలు హాజరు కాకపోగా.. సమావేశ బహిష్కరణకు వైకాపా నిర్ణయించుకుందని వివరించారు. మార్చిలో ఇచ్చిన ఎన్నికల ప్రకటన ఆధారంగా నిర్వహించిన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ఎన్నికల రద్దుకు అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందని ఎస్​ఈసీ తన కౌంటర్‌ అఫిడవిట్‌లో తెలిపారు.

ఎస్​ఈసీకి అవసరమైన వనరులు సమకూర్చాలని... ఎన్నికల కమిషన్‌కు భద్రత పెంచాలని తన అఫిడవిట్‌లో రమేశ్‌కుమార్‌ కోరారు. తొలి దశ ఎన్నికల ప్రక్రియ అనుభవాల దృష్ట్యా ఎస్​ఈసీ ఆందోళనలో ఉందన్నారు. సవాళ్లను ఎదుర్కొంటూనే తన అధికారాలను అమలు చేసేందుకు ఎస్​ఈసీ నిర్ణయించుకుందని తెలిపారు. గతంలో తప్పుచేసిన ఉన్నతాధికారులపై సిఫారసు చేసినా... ప్రభుత్వం చర్యలు చేపట్టలేదన్నారు. ఇప్పటికే జరిగిన ఉల్లంఘనల దృష్ట్యా కమిషన్ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిందని...బిహార్‌లో ఎన్నికలు జరుగుతుండగా.... తెలంగాణలోనూ మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయని వివరించారు.

ఏపీలో కరోనా కేసుల సంఖ్య గతంలో ఎక్కువగా ఉండేదని... ప్రస్తుతం తగ్గిందని రమేశ్‌కుమార్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఎన్నికల విషయమై చర్చించామన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా కరోనా ప్రారంభంలోనే ఎస్​ఈసీ తగిన చర్యలు తీసుకుందని వివరించారు. దేశంలో తొలిసారిగా ఎన్నికల ప్రక్రియను నిలిపివేశామని పేర్కొన్నారు. తగిన జాగ్రత్తలతో దశలవారీగా షెడ్యూల్‌ ఇవ్వాలని కమిషన్ భావిస్తోందన్నారు. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేసినందుకు ఏపీ సీఎం, స్పీకర్‌, పలువురు మంత్రులు... ఎన్నికల కమిషనర్‌పై కనికరం లేకుండా వ్యవహరించారని ఎస్​ఈసీ తన అఫిడవిట్‌లో తెలిపారు. ప్రభుత్వ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. సీఐడీ కేసు నమోదు చేసి ఎస్​ఈసీలోని కీలక సామగ్రి స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. దేశంలో ఈ తరహా ఘటన అరుదైనదని అభిప్రాయపడ్డారు. ఆ సామగ్రి కోసం ఎదురుచూస్తున్నామన్న ఎస్​ఈసీ... తమను లక్ష్యంగా చేసుకుని 24 గంటలూ నిఘా ఉంచారన్నారు.

ఇదీచదవండి: చలివేస్తుందని ఆగాడు.. అనంతలోకాలకు పోయాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.