ETV Bharat / state

ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమం.. బస్టాండ్​లోనే గర్భిణీ ప్రసవం

నిండు గర్భిణీ.. నొప్పులు వస్తుండటంతో ఆటోలో ఆస్పత్రికి తరలిస్తున్నారు. మధ్యలోనే నొప్పులు ఎక్కువయ్యాయి. ఏం చెయ్యాలో తెలియక.. పక్కనే ఉన్న ఆర్టీసీ బస్టాండ్​లో ఉంచారు. సమాచారం తెలుసుకున్న ఏఎస్సై అక్కడకు చేరుకుని గర్భిణీకి వైద్య సహాయం అందేలా చేశారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది.

pregnant-lady-delivery-in-bus-stop-in-ananthapuram
ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమం.. బస్టాండ్​లోనే గర్భిణీ ప్రసవం
author img

By

Published : Jul 24, 2020, 9:54 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో ఓ గర్భిణీ అత్యవసర పరిస్థితుల దృష్ట్యా.. బస్టాండ్​లోనే ప్రసవించింది. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ఎర్రయ్యపల్లి గ్రామం నుంచి నిండు గర్భిణీని ఆటోలో బంధువులు ఆస్పత్రికి తీసుకువస్తుండగా ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్బిణీని.. దిక్కుతోచని స్థితిలో రాప్తాడు బస్టాండ్​లో ఉంచారు. విషయం తెలుసుకున్న రాప్తాడు ఏఎస్సై నాగభూషణం అక్కడికి చేరుకుని ఆర్​ఎంపీ డాక్టర్, ఆయా లక్ష్మీదేవి సహకారంతో వైద్యం అందేలా చేశారు.

అనంతరం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉండటంతో వారిని 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. కరోనా విజృంభిస్తున్న వేళ.. మనిషి మనిషిని తాకడానికి భయపడుతున్న తరుణంలో ఏఎస్సై తన బాధ్యతను నిర్వహించి రెండు ప్రాణాలను కాపాడారని గర్భిణీ కృతజ్ఞతలు తెలిపింది.

ఇదీ చదవండి: ఇదీ చదవండి: 'రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశ.. అప్రమత్తంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.