* ఇంటి బయటకు వెళ్తున్నారంటే తొలుత మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. ఏ మాత్రం నలతగా ఉన్నా మార్కెట్‌కు వెళ్లే ఆలోచన మానుకోండి. మీ స్నేహితులనో, ఇరుగుపొరుగు వారినో తెచ్చివ్వమని కోరండి.
* ఒక్కరే వెళ్లాలన్న విషయం మరవొద్దు. ముందుగా ఏమేం సరకులు అత్యవసరమో జాబితా రాయాలి. అనవసరంగా ఒక్కటీ ఎక్కువ రాయవద్దు.
* ముందుగా ఉప్పు పప్పులు, చక్కెర వంటి కిరాణా సరకులు తీసుకోవాలి. తర్వాత పాలు, పాల పదార్థాలు.. చివరిగా కోడిగుడ్లు, మాంసం, చేపలు తీసుకోవాలి.
* ఫేస్ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోండి. వీలుంటే శానిటైజర్, వైప్స్ దగ్గర ఉంచుకోండి.
* అన్నింటికంటే ముఖ్యంగా భౌతిక దూరం పాటించాలి. ఇతరులకు ఆరు అడుగుల దూరంలో ఉండాలి.
* చూసిన వాటినల్లా ముట్టుకోవద్దు. మీరేం కొంటున్నారో వాటినే తీసుకోండి. పండ్లు, కూరగాయల విషయంలో ఏరి చూడకుండా చూసి తీసుకోవడం ఉత్తమం.
* సూపర్‌బజార్‌లో ముఖాన్ని అసలు తాకొద్దు. ఆడవాళ్లు జుట్టు ముఖంపై పడకుండా ముడి వేసుకోవాలి.
* బిల్లింగ్ వద్ద స్పర్శకు తావు లేని పద్ధతుల్ని ఎంచుకోండి. కాంటాక్ట్‌లెస్ కార్డులు, గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటివి ఉన్నాయిగా.
* ఇంటికి రాగానే ముందుగా చేతులు సబ్బుతో 20-30 సెకన్ల పాటు కడుక్కోండి. తర్వాత పండ్లు, కూరగాయల్ని బాగా కడిగాకే ఫ్రిజ్‌లో పెట్టాలి. కడిగే ముందు బేకింగ్ సోడా వేసిన నీటిలో ఓ పావుగంట ఉంచితే మేలు.