ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2022 వరకు దేశంలో ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరుతుందని భాజపా గ్రేటర్ ఉపాధ్యక్షుడు బండపల్లి సతీష్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ప్రధాని మోదీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజులపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లాలాపేట్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, అనాథశరణాలయంలో చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు.
దేశానికి ఎంతో సేవ చేస్తున్న ప్రధానమంత్రికి కృతజ్ఞత తెలుపుతూ వారం రోజులపాటు సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో పలు సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సతీష్‌గౌడ్ తెలిపారు.
ఇదీ చదవండిః మొక్కల పుట్టినరోజు వేడుకలు చూదము రారండి..