ETV Bharat / state

ప్రీ బిడ్ సమావేశం.. గ్లోబల్​ టెండర్లపై స్పష్టత వచ్చే అవకాశం.!

author img

By

Published : May 26, 2021, 8:58 AM IST

టీకాల కోసం అన్ని రాష్ట్రాలు ప్రధానంగా గ్లోబల్ టెండర్స్​పై దృష్టి సారించాయి. అదేబాటలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీనికి సంబంధించిన ప్రీబిడ్ సమావేశం జరగనుంది. మరోవైపు రాష్ట్రాలకు విక్రయించబోమని ఫైజర్, మోడెర్నా కంపెనీలు ప్రకటన నేపథ్యంలో ఎవరూ ముందుకొస్తారో వేచి చూడాల్సిందే.

pre bid meeting on  global tender
గ్లోబల్ టెండర్లపై ప్రీ బిడ్ సమావేశం

టీకాల కోసం రాష్ట్రం ఇచ్చిన గ్లోబల్ టెండర్లకు సంబంధించి ఇవాళ కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టెండర్లకు సంబంధించి సాయంత్రం ప్రీబిడ్ సమావేశం జరగనుంది. తాము రాష్ట్రాలకు విక్రయించబోమన్న ఫైజర్, మోడర్నా ప్రకటన, ఇప్పటికే కంపెనీల వివిధ ఒప్పందాల నేపథ్యంలో ఏ సంస్థలు ముందుకొస్తాయన్నది చూడాలి

ప్రీబిడ్ సమావేశం

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రజలకు వీలైనంత త్వరగా కోవిడ్ టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా టీకాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రానికి సరిపడా టీకా డోసులను సమకూర్చుకునేందుకు ఉత్పత్తిదారులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంప్రదించింది. అటు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న టీకాల సరఫరాకు వీలుగా గ్లోబల్ టెండర్లను కూడా పిలిచింది. ఏడాదిలో కోటి డోసులు సమకూర్చేలా టెండర్ పిలిచింది. ప్రతి నెలా కనీసం 15 లక్షల డోసులను సరఫరా చేయాలన్నది నిబంధన. టీకాల టెండర్ల దాఖలుకు వచ్చే నెల నాలుగో తేదీ వరకు గడువుంది. ఇందుకు సంబంధించి ఇవాళ ప్రీబిడ్ సమావేశం జరగనుంది. ఆసక్తి గల ఉత్పత్తిదారులు ఇవాళ్టి ఇందులో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

కేంద్రంతో ఉత్పత్తిసంస్థల ఒప్పందాలు

అయితే ప్రపంచ వ్యాప్త పరిణామాలు చూస్తోంటే ఎన్ని సంస్థలు గ్లోబల్ టెండర్లకు ముందుకొస్తాయన్నది చూడాలి. రాష్ట్రానికి చెందిన భారత్ బయోటెక్, పుణె సీరం ఇనిస్టిట్యూట్ సంస్థలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ షరతులకు లోబడి కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను సరఫరా చేస్తున్నాయి. రెడ్డీసీ ల్యాబ్స్ స్పుత్నిక్ - వీ టీకాను మార్కెట్లోకి తెచ్చింది. ఈ సంస్థల ఉత్పత్తి మరికొన్ని నెలలు గడిస్తే గానీ ఎక్కువగా వచ్చే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశిత టీకా డోసులను సరఫరా చేయాల్సి ఉంటుంది.

రాష్ట్రాలకు విక్రయించలేమన్న ఫైజర్, మోడెర్నా

అటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఆయా కంపెనీల నుంచి నేరుగా టీకాలను సమకూర్చుకుంటున్నాయి. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలు కూడా టీకాల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచాయి. అటు ఫైజర్, మోడెర్నా సంస్థలు తాము రాష్ట్రాలకు టీకాలు విక్రయించలేమని.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఇస్తామని అంటున్నాయి. ఆ కంపెనీలు సైతం ఇప్పటికే వేర్వేరు దేశాలతో ఒప్పందాలు చేసుకున్నాయి.

సాయంత్రం రానున్న స్పష్టత

ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఇచ్చిన గ్లోబల్ టెండర్లకు ఏయే సంస్థలు ముందుకొస్తాయన్నది చూడాలి. ఇవాళ సాయంత్రం ఆరుగంటలకు ఆన్ లైన్ లో ప్రీబిడ్ సమావేశం జరగనుంది. ఆసక్తి కలిగిన సంస్థలు ఈ సమావేశంలో పాల్గొంటాయి. దీంతో ఏయే కంపెనీలు ముందుకొస్తాయన్న విషయమై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదీచూడండి: పెద్దదిక్కు ప్రాణాలు హరించి.. కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.