పురోగమిస్తోన్న తెలంగాణలో రక్తపుటేర్లు పారించేందుకు మావోయిస్టులు యత్నిస్తున్నారని ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ అధికార ప్రతినిధి భరత్ ఆరోపించారు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. భయోత్పాతం సృష్టించి చందాల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నుతున్నారన్నారు. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్, దామోదర్ పార్టీ ఫండ్ వసూలు చేసి బినామీల పేరుతో కూడబెట్టారని భరత్ అన్నారు.
'అందుకే గిరి ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదు'
మావోయిస్టు చర్యల వల్ల ఛత్తీస్‌గఢ్ గిరిజనులు అభివృద్ధికి నోచుకోవట్లేదన్నారు. కొవిడ్ వల్ల కాల్పుల విరమణ పాటించామంటున్న మావోయిస్టులు.. ఛత్తీస్‌గఢ్‌లో పోలీస్ సానుభూతిపరులంటూ 17 మందిని చంపినట్లు భరత్ గుర్తుచేశారు. మావోయిస్టుల ఆటలు రాష్ట్రంలో సాగనివ్వమని.. ఏ ఒక్కరికి హాని జరిగినా ప్రజల చేతిలో జగన్, దామోదర్‌కు ముగింపు తప్పదని కమిటీ అధికార ప్రతినిధి భరత్ అన్నారు.
ఇవీ చూడండి : ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులతో మంత్రి ఈటల సమీక్ష