ETV Bharat / state

రెండు రోజుల విరామం తర్వాత నేటి నుంచి మళ్లీ 'ప్రజాపాలన' - నేటి నుంచి ప్రజాపాలన

Praja Palana Telangana 2024 Today : రెండ్రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కార్యక్రమం మళ్లీ నేటి నుంచి జరగనుంది. గత నెల 28వ తేదీన ప్రారంభమైన ఆ కార్యక్రమానికి న్యూ ఇయర్ సందర్భంగా రెండ్రోజులు విరామం ఏర్పడింది. ఈ క్రమంలోనే తిరిగి ఈరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు రెండు విడతలుగా గ్రామ, వార్డు సదస్సులు నిర్వహించనున్నారు.

Praja Palana Again From Today
Praja Palana Applications 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 7:46 AM IST

రెండు రోజుల విరామం తర్వాత నేటి నుంచి మళ్లీ ప్రజా పాలన

Praja Palana Telangana 2024 Today : రెండు రోజుల విరామం తర్వాత ప్రజా పాల నేటి నుంచి మళ్లీ జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు రెండు విడతలుగా గ్రామ, వార్డు సదస్సులు ఉంటాయి. ఇప్పటికే 40 లక్షల 57 వేల 952 దరఖాస్తులు రాగా మరో 5 రోజులు ఉండటంతో వాటి సంఖ్య కోటి దాటే అవకాశం కనిపిస్తోంది. దరఖాస్తుల తీరు, నిబంధనలపై పలు అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. పింఛన్లు, రైతుభరోసా కోసం ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు పథకాల కోసం మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు.

Telangana Praja Palana 2024 : ప్రజాపాలన సదస్సులు ఇవాళ్టి నుంచి ఈనెల 6వరకు జరగనున్నాయి. గత నెల 28న ప్రారంభమైన ఆ కార్యక్రమానికి సెలవులతో రెండ్రోజుల విరామం ఏర్పడింది. గతనెల 28 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 868 గ్రామాలు, 8 వేల 697 మున్సిపల్ వార్డుల్లో సదస్సులు నిర్వహించారు. 6 గ్యారెంటీల పథకాలు సహా రేషన్‌ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో 40 లక్షల 57 వేల 592 దరఖాస్తులు రాగా రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

ప్రజాపాలన దరఖాస్తు ఎలా నింపాలి? - ఏయే డాక్యుమెంట్లు అవసరం?

Huge Response Praja Palana in Telangana : తొలి రోజు 7 లక్షల 46 వేల 414, రెండో రోజు 8లక్షల 12 వేల 862, మూడో రోజు అత్యధికంగా 18 లక్షల 29 వేల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈనెల 6 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉండటంతో కోటి దాటే అవకాశం కనిపిస్తోంది. ఎక్కువగా మహాలక్ష్మి పథకంలోని గ్యాస్‌ సిలిండర్, 2,500, గృహజ్యోతి పథకంలోని 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, ఇళ్ల స్థలాల కోసం ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రజాపాలన కార్యక్రమానికి నోడల్‌ అధికారుల నియామకం

Praja Palana Applications 2024 : ప్రజలు సమర్పించిన దరఖాస్తులను ఎవరు చేయాలనే విషయంతో పాటు నిబంధనలపై అయోమయం, గందరగోళం కొనసాగుతోంది. వేర్వేరు పథకాల కోసం ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు దరఖాస్తు చేస్తున్నారు. పింఛన్లు, రైతుభరోసా పథకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కొత్తగా అవసరమైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తుల కొరతతో చాలామంది బయట కొనుగోలు చేస్తున్నారు.

దరఖాస్తులను ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. దరఖాస్తులను బయట విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తైన తర్వాత వచ్చిన సమాచారం ఆధారంగా ఎంతమందికి అవసరమనే అంచనా వచ్చాక పథకాల అమలు కోసం పూర్తిస్థాయి విధివిధానాలు, నిధుల కేటాయింపుపై కసరత్తు జరిగే అవకాశం ఉంది.

'రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దు - పాత లబ్ధిదారులందరికీ కొనసాగిస్తాం'

నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ - అయిదు పథకాలకు ఒకే అర్జీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.