ETV Bharat / state

'కోటె'త్తిన అప్లికేషన్లు - ప్రజాపాలన దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు - Prajapalana 7 th day

Praja Palana Programme in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులు కోటి దాటాయి. వారం రోజుల్లోనే కోటి 8 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. నేటితో ప్రజాపాలన సభలు ముగియనున్నాయి. ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

Prajapalana Applications
Last Day To Submit Prajapalana Applications
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 7:43 AM IST

ప్రజాపాలన దరఖాస్తుకు నేడే ఆఖరు - కోటి దాటిన దరఖాస్తులు

Praja Palana Programme in Telangana : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం(Prajapalana Programme) ఉత్సాహంగా సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్​లో అభయహస్తం దరఖాస్తులకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. దరఖాస్తులు సమర్పించేందుకు ఇవాళ ఒక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ క్రమంలో నిన్న ఒక్క రోజే 2 లక్షల 48 వేల 647 మంది ఆరు గ్యారంటీలు తమకు కావాలంటూ ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. నారాయణగూడలోని వార్డు కార్యాలయాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ రెడ్డితో కలిసి అధికారులు సందర్శించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్‌ క్రాంతి పాల్గొని దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వం అందిస్తున్న ఆరు గార్యెంటీ పథకాల్లో దళారులకు చోటు లేదు - ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు

Minister Damodara Raja Narsimha In Sangareddy Prajapalana : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా ప్రజలకు మెరుగైన సుపరిపాలనను చేరువ చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Raja Narsimha) తెలిపారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపల్ పరిధి 17,18వ వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లుగా నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని మంత్రి విమర్శించారు.

Prajapalana Applications : కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్‌, గాంధారి మండలాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌రావు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమాన్ని కోరుట్ల కాంగ్రెస్ ఇంఛార్జీ జువ్వడి నర్సింగ రావు పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో రుద్రవరంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన వార్డు సదస్సును కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజా పాలన నోడల్ అధికారి శ్రీ దేవసేన, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి పరిశీలించారు. దరఖాస్తుదారులతో నోడల్ అధికారి మాట్లాడి ఏ ఏ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారని తెలుసుకున్నారు.

రెండు రోజుల తర్వాత ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ - క్యూ కట్టిన ప్రజానికం

"ప్రజా పాలన దరఖాస్తుల సమాచారం అంతా కంప్యూటర్​లో నిక్షిప్తం చేస్తాం. విచారణ కోసం అధికారులు అర్హులైన వారి ఇంటికి వస్తారు. దరఖాస్తుదారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇళ్లు, పెన్షన్​ అర్హత ఉందా? లేదా? అనేది పరిశీలించి, ప్రభుత్వానికి అధికారులు తెలియజేస్తారు. ఎవరి పైరవీలు, పార్టీ ప్రమేయం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం."-కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి

Minister Konda Surekha In Warangal Prajapalana : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల, సీతారాంపురంలో ప్రజాపాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్ద కొడపాకలో ప్రజా పాలన కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఎలాంటి పైరవీలకు తావులేకుండా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు డివిజన్‌లలో ప్రజా పాలన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. బీఆర్​ఎస్​ నేతలు అభయహస్తంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజాపాలన కార్యక్రమం ఆఖరి రోజు కావడంతో అభయహస్తం ఆరు గ్యారంటీలతో పాటు ఇతర దరఖాస్తులు చేసుకునేందుకు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.

ప్రజాపాలనకు దరఖాస్తుల వెల్లువ- రెండోరోజు 8,12,862 అప్లికేషన్లు

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా పాలన : మంత్రి సీతక్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.