హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెరాస ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో అమరవీరులకు గుర్తింపు లేదని... సీఎం పెంపుడు కుక్కలకు, మజ్లిస్ పార్టీకి మాత్రమే గౌరవం ఉందని ఆరోపించారు. కేసీఆర్ కారుపై మజ్లిస్ సవారీ చేస్తోందని ఎద్దేవా చేశారు. అమరవీరుల కారణంగానే ఇప్పుడు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని... అలాంటి వారిని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు.
ఇదీ చదవండిః ప్రజల ఆత్మగౌరవ అంశాన్ని భాజపా భుజాలపై ఎత్తుకుంది: లక్ష్మణ్