హైదరాబాద్ నగరంలో జరగనున్న మొహారం పండుగనను పురస్కరించుకుని సీపీ అంజనీ కుమార్ ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు షియా మతపెద్దలతో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఉన్నందున.. మత సామరస్యం పాటించాలని ప్రజలకు సూచించారు. ఇరు మతాలు శాంతియుతంగా వేడుకలు చేసుకోవాలని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి మొహారం సంతాప దినాలు ప్రారంభమై.... 68 రోజుల పాటు కొనసాగుతాయని వివరించారు.. పదేళ్ల క్రితం ఇరాక్ ఇతర దేశాలలో జరిగిన హింసా ఘటనలాగా ... సామాజిక మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. అన్ని విభాగాల అధికారులు ఏర్పాట్లకు సంబంధించిన పనులు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీచూడండి:ఆరోగ్యశ్రీ బంద్... 'గాంధీ'లో కిటకిట