ETV Bharat / state

తెలంగాణ ఇంటలిజెన్స్​ చీఫ్​గా ప్రభాకర్​రావు నియామకం - నిఘా విభాగాధిపతిగా ప్రభాకర్​రావు

తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ (నిఘా)అధిపతిగా ప్రభాకర్ రావును ప్రభుత్వం నియమించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ పదవి విరమణ చేయడం వల్ల ఆయన స్థానంలో ప్రభాకర్ రావును నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

Prabhakar Rao appointed as Telangana Intelligence Chief
తెలంగాణ ఇంటలిజెన్స్​ చీఫ్​గా ప్రభాకర్​రావు నియామకం
author img

By

Published : Nov 1, 2020, 5:09 AM IST

రాష్ట్ర పోలీసు శాఖ ఇంటలిజెన్స్​ (నిఘా విభాగం) అధిపతిగా సీనియర్​ అధికారి ప్రభాకర్​రావు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ స్థానంలో పనిచేసిన నవీన్​చంద్​ శనివారం ఉద్యోగ విరమణ పొందటంతో ప్రభుత్వం ప్రభాకర్​రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

1991లో డీఎస్పీగా పోలీసుశాఖలో చేరిన ప్రభాకర్​రావు గతంలో నల్గొండ ఎస్పీగా, హైదరాబాద్​ సీసీఎస్​ అధిపతిగా, నిఘా విభాగం డీఐజీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గత జూన్​ 30న ఉద్యోగ విరమణ పొందారు. ఆ వెంటనే ప్రభుత్వం రెండేళ్ల పదవీ కాలం పొడిగిస్తూ ఎస్​ఐబీలోనే కొనసాగించింది. తాజాగా ఆయనకే నిఘా విభాగం బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవీ చూడండి: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మరో పది రోజుల సమయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.