ETV Bharat / state

'సుందర భవనం కడతామంటే.. శిథిలాల్లోనే మగ్గాలంటున్నరు'

author img

By

Published : Jul 7, 2020, 6:23 PM IST

వంద జన్మలు ఎత్తినా రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రతిపక్షాలు తీసుకురాలేవని మంత్రి జగదీశ్​ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా నూతన సచివాలయం నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు.

minister jagadesh reddy press meet
వంద జన్మలు ఎత్తినా మీరు ఆ పథకాలు తీసుకురాలేరు: జగదీశ్​ రెడ్డి

నూతన సచివాలయం, ప్రగతిభవన్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయని విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా నూతన సచివాలయం నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని... ప్రతిపక్షాల విమర్శలను ప్రజలే తిప్పికొట్టారని తెలిపారు.

వ్యవసాయం దండగ అని, 24 గంటల విద్యుత్​ ఇస్తామంటే వద్దని ధర్నాలు చేయడం ఇలా ప్రజల సంక్షేమం కోసం ఏ పథకాన్ని ప్రవేశ పెడుతున్నా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని జగదీశ్​ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, అందుకే బడ్జెట్​లో అధిక నిధులు కేటాయించామని చెప్పారు. గతంలో ఉపాధి లేక వలస వెళ్లిన వారంతా సొంతూళ్లకు వస్తున్నారన్నారు. తెరాస సర్కారు ఎన్నికల మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తోందని... ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జగదీశ్​ రెడ్డి అన్నారు.

"ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని అమలు చేయమని తెలంగాణ ప్రజలు తెరాస పార్టీకి అధికారం కట్టబెట్టారు. పాడుబడ్డ శిథిలాలు ఇచ్చిపోయారు... ఇంకా ఆ శిథిలాల్లో కూర్చోలేమని ముఖ్యమంత్రి కేసీఆర్​ గతంలోనే చెప్పారు. ఈ రాష్ట్రం ఎంత ఉన్నతంగా ఉందో... ఈ రాష్ట్ర గౌరవాన్ని దేశానికి, ప్రపంచానికి చెప్పే పద్ధతుల్లో మా సెక్రటరేట్​ ఉండేలా... రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింప చేసే పద్ధతుల్లో నిర్మాణం చేపడతాం. కరోనా దాడి చేస్తున్న సందర్భంలో కరోనాతో కలిసి అంతకంటే దుర్మార్గంగా దాడిచేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలుసుకోండి."

- జగదీశ్​ రెడ్డి, విద్యుత్​ శాఖ మంత్రి.

ఇదీ చూడండి: చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.