ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుపై ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తొలుత ఉద్యోగుల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించినందున విద్యుత్ సౌధా లోపలే నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు షరతులతో అనుమతించడం వల్ల గన్‌పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. రేవంత్ వ్యాఖ్యలను ఉద్యోగ సంఘాల నేతలు ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి వెంటనే సీఎండీ ప్రభాకర్ రావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ