లాక్‌డౌన్, వేసవి కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కరోనా వల్ల విద్యుత్ సిబ్బంది 2 నెలలు రీడింగ్ తీయలేకపోయారని పేర్కొన్నారు. సాధారణంగా ప్రతివేసవిలో విద్యుత్ వినియోగం 30 శాతం వరకు పెరుగుతుందని వివరించారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది, పోలీసుశాఖతో పాటు విద్యుత్ సిబ్బంది కూడా బాగా కృషి చేశారని కితాబిచ్చారు.
2019 ఏప్రిల్, మే నెలల ఆధారంగా బిల్లు వేయాలని ఈఆర్‌సీ చెప్పిందని వివరించారు. 3 నెలల విద్యుత్ వినియోగాన్ని సగటు ఆధారంగా విభజిస్తామని చెప్పినట్లు తెలిపారు. విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చిందనే ఆందోళనల్లో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు.