ETV Bharat / state

కరెంట్ షాక్..  వినియోగం తగ్గినా పెరిగిన బిల్లులు - తెలంగాణలో విద్యుత్​ వినియోగ సమాచారం

‘‘లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లలోనే ఉండటం వల్ల కరెంటు వాడకం పెరిగింది. అందుకే బిల్లులు ఎక్కువొచ్చాయి’’ బిల్లుల మోతపై ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’(డిస్కం)లు ఇటీవల చెప్పిన మాట ఇది. అవే డిస్కంలు ఈనెల మొదటివారంలో ఇంటింటికీ తిరిగి నమోదు చేసిన కరెంటు మీటర్‌ రీడింగ్‌ లెక్కలను పరిశీలిస్తే ఈ వాదన తప్పని అర్థమవుతోంది.

గతేడాదికన్నా తగ్గిన విద్యుత్‌ వినియోగం.. అయినా పెరిగిన బిల్లులు

author img

By

Published : Jun 27, 2020, 6:49 AM IST

లాక్‌డౌన్‌లో ప్రజలందరూ ఇళ‌్లలోనే ఉన్నందునే కరెంట్‌ వినియోగం పెరిగిందన్న విద్యుత్‌ సంస్థల మాటలు ఇప్పుడు తప్పని తెలుస్తోంది. గతేడాది(2019) మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ప్రజలకు వాడుకున్న విద్యుత్‌ ప్రకారం అవే బిల్లులను ఈ ఏడాది లాక్‌డౌన్‌లోనూ ఏప్రిల్‌, మే నెలల్లో జారీ చేశారు. లాక్‌డౌన్‌ సడలింపుతో ఈ నెల మొదటివారంలో ఇళ్లకెళ్లి విద్యుత్‌ సిబ్బంది మీటరు రీడింగ్‌ తీశారు ఇందులో నమోదైన యూనిట్ల ప్రకారం గత మూణ్నెల్లకు నెలవారీగా సగటు యూనిట్ల చొప్పున లెక్కించి ఈ నెల మొదటివారంలో బిల్లులను డిస్కంలు జారీ చేశాయి. ఈ లెక్కలతో శ్లాబులు మారిపోయి బిల్లులు పెరిగాయని తేలింది.

ఎలా తగ్గిందంటే..

* రాష్ట్రంలో గతేడాది(2019) మే నెలలో మొత్తం 85.89 లక్షల ఇళ్ల కనెక్షన్లకు 143.10 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగమైంది. అంటే ఒక్కో కనెక్షన్‌కు 166.60 యూనిట్ల విద్యుత్‌ వినియోగించినట్లు అర్థం. ఆ నెలలో రూ.796.56 కోట్లను బిల్లుల రూపంలో రెండు డిస్కంలు వసూలు చేశాయి.

* ఈ ఏడాది(2020) మే నెలలో మొత్తం 89.29 లక్షల ఇళ్ల కనెక్షన్లకు 135.32 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగమైంది. సగటున ఒక్కో కనెక్షన్‌కు 151.53 యూనిట్లు. గతేడాది మే నెలలో కాల్చిన సగటు 166.60కన్నా ఈ ఏడాది అదే నెలలో 15 యూనిట్లు తక్కువ వినియోగించారు. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లలో ఉన్నారు. పైగా ఈ ఏడాది 3.40 లక్షల కనెక్షన్లు పెరిగాయి.

* గతేడాది మే నెలలో కాల్చిన 143.10 కోట్ల యూనిట్ల కన్నా ఈ ఏడాది మేలో 7.78 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగం తగ్గిందని మీటర్‌ రీడింగ్‌ లెక్కల ద్వారా తేలింది.

* 2019లో మార్చి, ఏప్రిల్‌, మే.. అంటే మూణ్నెల్లకు కలిపి మొత్తం 380.17 కోట్ల యూనిట్ల కరెంటును ప్రజలు ఇళ్లలో వినియోగించారు.

* ఈ ఏడాది మూణ్నెల్లకు 371.09 కోట్ల యూనిట్లను వాడారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.08 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగం తగ్గింది. ఈ తగ్గుదలలో మే నెలలోనే 7.78 కోట్ల యూనిట్లుంది. మార్చి, ఏప్రిల్‌, మే నెలలది జూన్‌లో రీడింగ్‌ తీశారు. తగ్గిన 9.08 కోట్ల యూనిట్లను మూణ్నెల్లకు కలిపి సగటు చేశారు. దీనివల్ల నెలవారీ బిల్లుల సగటు పెద్దగా తగ్గలేదు.

* ఏ నెలకానెల రీడింగ్‌ తీస్తే ఏప్రిల్‌ నెలలో, జూన్‌లో ఇచ్చిన బిల్లు చాలా తగ్గేదని తేలింది. మే నెలలో ఇచ్చిన బిల్లు గతేడాదితో పోలిస్తే కాస్త అటుఇటుగా ఉండేది.

* లాక్‌డౌన్‌లో కరెంటు వినియోగం, ఆదాయం తగ్గడంతో డిస్కంలు గతేడాదితో పోలిస్తే రూ.72.83 కోట్ల ఆదాయాన్ని నష్టపోయాయి. మూణ్నెల్ల రీడింగ్‌ను ఒకేసారి జూన్‌లో తీసి సగటున పంచడంతో.. శ్లాబు రేట్లు మారి బిల్లులు ఎక్కువ చెల్లించి ప్రజలు నష్టపోయారు. ఇలా జరగడం వల్ల అటు ప్రజలు, ఇటు డిస్కంలు నష్టపోయినట్లు ఓ అధికారి వివరించారు.

ఇవీచూడండి: గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.