ETV Bharat / state

మెట్రోస్టేషన్లలో అద్దెకు మొబైల్‌ పవర్‌బ్యాంక్‌లు

మెట్రోలో ప్రయాణం చేస్తున్నారా.. చరవాణీలో ఛార్జింగ్​ అయిపోతుందని కంగారు పడుతున్నారా.. ఇక మీదట ఆ సమస్య ఉండదు లేండీ.. ఎందుకనుకుంటున్నారా.. మెట్రో స్టేషన్లలో ఛార్టింగ్​ పెట్టుకోడానికి వీలుగా అద్దెకు పవర్​ బ్యాంకులు ఇస్తున్నారట అదీ కేవలం గంటకు 3 రూపాయలేనటా..! నమ్మలేక పోతున్నారా అయితే ఈ కథనం చదవండి.

author img

By

Published : Feb 24, 2020, 12:47 PM IST

Power Bank For Rent In Metro Stations With Rs 3 Per Hour In Hyderabad
మెట్రోస్టేషన్లలో అద్దెకు మొబైల్‌ పవర్‌బ్యాంక్‌లు

భాగ్యనగరంలో మెట్రో రైలు ప్రయాణికులకు మొబైల్‌ పవర్‌ బ్యాంక్‌లు అందుబాటులోకి వచ్చాయి. స్టేషన్లలో వీటిని అద్దె ప్రాతిపదికన తీసుకోవచ్చు. ప్రస్తుతం 20 స్టేషన్లలో ప్రత్యేక కియోస్క్‌ల ద్వారా వీటిని అందుబాటులో ఉంచారు. క్రమంగా అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు.

ప్లగ్‌ అనే సంస్థ మెట్రో సౌజన్యంతో కలిసి వీటిని ఏర్పాటు చేసింది. రూ.199 డిపాజిట్‌ చేసి పవర్‌బ్యాంక్‌ తీసుకెళ్లొచ్చు. గంటకు రూ.3 కనీస అద్దెగా నిర్ణయించారు. 24 గంటల వరకు రూ.9, ఆ తర్వాత రోజు రూ.9 చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు.

మూడు నెలలకు రూ.349, ఏడాదికి రూ.699 చందాతో ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. మెట్రో రైల్లో ఛార్జింగ్‌ పిన్‌లు ఉన్నా.. వెంట ఛార్జర్‌ లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారని అందుకే ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు.. ఇకపై అటువంటి సమస్య ఉండదని వారు అంటున్నారు.

ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: ఆతిథ్యం సరే.. మరి ఒప్పందాల మాటేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.