అగ్రవర్ణాల ఆధిపత్యం, ఆర్థిక పునాదులపై ఆధారపడి సమాజాన్ని నడిపించే శక్తులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ పేర్కొన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని మాక్స్ భవన్లో పీవోడబ్ల్యూ, పీవైఎల్, పీడీఎస్యూ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కులాంతర వివాహాలు - కులోన్మాద హత్యలు అంశంపై సదస్సు నిర్వహించాయి.
సమాజంలో కులాంతర వివాహం చేసుకునే వ్యక్తులకు రక్షణ కరవైందని ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు. మతం, కులం, అనువాదాన్ని నిలబెట్టుకోవడానికి కొందరు చేస్తున్న కృషిని కూకటివేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి: హేమంత్ హత్య కేసు నిందితులకు పోలీసు కస్టడీ