ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. తన వ్యక్తిగత పీఏ ద్వారా శాశనమండలి ఛైర్మన్‌కు రాజీనామా పత్రం పంపించారు. బీసీ, ఎస్సీ, మైనారిటీల ప్రయోజనాలకు తెలుగుదేశంపార్టీ వ్యతిరేకంగా పనిచేస్తుందని పోతుల సునీత రాజీనామాలో పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడేందుకే రాజీనామా చేసినట్లు పోతుల సునీత తెలిపారు.
ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటే దేవుడికి కట్నం!