ETV Bharat / state

రూ.లక్షల్లో పొట్టేళ్ల ధర.. అయినా కొంటున్న జనం.. కారణమదే..! - ap latest news

సాధారణంగా పొట్టేళ్ల ధరలు ఎంతుంటాయి. మహా అయితే రూ.30 వేలు. కానీ ఏపీలోని బాపట్ల జిల్లాలో ఓ యువకుడు పెంచే పొట్టేళ్లు మాత్రం.. రూ.లక్షకు పైగానే ధర పలుకుతున్నాయి. మంచి బ్రీడ్ కావాలనుకునే వారితో పాటు.. బక్రీద్ సందర్భంగా ఖుర్భానీ కోసం ఎక్కువ మంది ఇక్కడ పొట్టేళ్లు కొనుగోలు చేస్తున్నారు.

రూ.లక్షల్లో పొట్టేళ్ల ధర.. అయినా కొంటున్న జనం.. కారణమదే..!

author img

By

Published : Jul 10, 2022, 2:25 PM IST

రూ.లక్షల్లో పొట్టేళ్ల ధర.. అయినా కొంటున్న జనం.. కారణమదే..!

వాడైన చూపులు.. మెలి తిరిగిన కొమ్ములు.. బలిష్టంగా ఉన్న ఇలాంటి పొట్టేళ్లను ఎక్కడైనా చూశారా? ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లికి చెందిన డి.కె.రెడ్డి.. రెండేళ్ల నుంచి ఇలాంటి పొట్టేళ్లను పెంచుతున్నారు. కొవిడ్ సమయంలో ఖాళీగా ఉండలేక.. తండ్రి పెంచుతున్న పొట్టేళ్ల పెంపకాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. మేలు రకం పొట్టేళ్లను తెచ్చి.. తండ్రి సాయంతో పెంచడం మొదలుపెట్టారు. వాటికిచ్చే ఆహారం విషయంలోనూ రాజీ పడకుండా.. మంచి ఆహారం అందించారు. పొట్టేళ్లు త్వరగా పెరగటమే కాకుండా.. చూసేందుకు ముచ్చటగా, గొప్పగా కనిపిస్తున్నాయి.

సాధారణంగా మాంసం కోసం పెంచే పొట్టేళ్లను.. వాటి బరువు ఆధారంగా ధర నిర్ణయిస్తారు. కానీ వీటికి బరువుతో పని లేదు. కేవలం రూపం, ఆరోగ్యంగా ఉండటం మాత్రమే చూస్తారు. ఇక్కడ ప్రధానంగా నాటు రకాలు, చుక్కల జాల రకాలను పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు రకాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఇక్కడి పొట్టేళ్లని కొనుగోలు చేస్తుంటారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచీ వస్తుంటారని డి.కె.రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం బక్రీద్ సీజన్ కావటంతో ఖుర్భానీ కోసం ఎక్కువ మంది ఈ పొట్టేళ్లు తీసుకెళ్తున్నారు. మిగిలిన సమయాల్లో బ్రీడింగ్ కోసం కొనుగోలు చేస్తుంటారు. ఈ తరహా పొట్టేళ్లు పందాలకూ పనికొస్తాయి. కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగపడతాయనే భావనతో కొనుగోలు చేస్తుంటారు. ఖుర్బానీకి ఇచ్చే పొట్టేళ్లకు మంచి ఆరోగ్యం ఉంటే ధర పెట్టడానికి వెనుకాడరు.-డి.కె.రెడ్డి

ఇవీ చదవండి:

ఉన్నతాధికారి వేధిస్తున్నాడంటూ సీఎస్​కు అటవీశాఖ మహిళా సూపరింటెండెంట్​ లేఖ

Heavy rains in telangana: వదలని భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం

క్షమించండి.. ఇలా అయినందుకు సిగ్గు పడుతున్నా: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.