Postal Ballots Issue in Telangana : పోస్టల్ బ్యాలెట్ల విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. పోలింగ్ రోజు ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. గతంలో పోస్టల్ బ్యాలెట్ తీసుకుని ఓటు వేసి ఓట్ల లెక్కింపు రోజు వరకు పోస్ట్ ద్వారా పంపేవారు. అయితే పోస్టల్ బ్యాలెట్(Postal Ballots) దుర్వినియోగం అవుతోందని, ప్రలోభాలకు అవకాశం ఏర్పడుతుందన్న అభిప్రాయం ఉంది. దీంతో పోస్టల్ బ్యాలెట్ల విషయమై ఈసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Telangana Assembly Elections 2023 : సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లు తీసుకొని అధికారులు ఏర్పాటు చేసే ఫెసిలిటేషన్ సెంటర్ల(Facilitation Centers)లో పోలింగ్ విధులకు వెళ్లడం కంటే ముందే బ్యాలెట్ వేయాలని ఈసీ స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది నుంచి దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్ కోసం దాదాపు రెండు లక్షల మంది సిబ్బంది.. పోలీసులు, డ్రైవర్లు మరో లక్ష మంది ఉంటారు. వారందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారానే ఓటు హక్కు(Right to Vote) వినియోగించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు ఈనెల 23వ తేదీతో ముగిసింది.
'మా ఓటు వినియోగంపై ఎన్నికల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు'
EC New Rules on Postal Ballots : పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాల వారీగా అనుకూలమైన ప్రాంతాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయా కేంద్రాల వద్ద ఓటింగ్ కొనసాగుతుంది. అయితే మొత్తం మూడు లక్షల మందిలో 40శాతం వరకు ఉద్యోగులకు ఇంకా పోస్టల్ బ్యాలెట్ అందలేదు. దీంతో పలువురు ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్లు అందకపోవడం వల్ల తాము ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతామని తెలిపారు.
Employees Worry about Their Votes in Telangana : పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అనంతరం వాటిని ఓటుహక్కు ఉన్న రిటర్నింగ్ అధికారికి పంపాల్సి ఉంటుంది. ఆర్ఓ దరఖాస్తును పరిశీలించి పోస్టల్ బ్యాలెట్ జారీ చేయాలి. జారీ చేసిన దానిని సదరు ఉద్యోగి ఎన్నికల విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారికి పంపించాలి. అనంతరం ఉద్యోగులు ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించు కోవాల్సి ఉంటుంది. మొత్తం మూడు దశల్లో ఈ ప్రక్రియ జరగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్నికల అధికారికి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు చెందిన సిబ్బంది నుంచి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియకు చాలా గడువు పడుతోంది. దీంతో పోస్టల్ బ్యాలెట్ల జారీ ప్రక్రియ ఆలస్యమవుతోంది.
పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా ఈసీ కొత్త రూల్
Postal Ballot Last Date in Telangana : పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పందించి.. అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. 25వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ ఇంకా చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్ జారీ కాలేదు. శనివారం రాత్రి అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన గందరగోళం ఇంకా తొలగిపోలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ ఓటింగ్ ప్రారంభం - ముందుగా సమాచారం ఇచ్చి ఇళ్లకు వెళ్తున్న అధికారులు
పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం... తుప్పల్లో ఆధార్ కార్డులు.. ఇంకా..!