ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క పని సరిగా నిర్వర్తించరని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు వద్దంటున్నా మొండిగా పోయి బోల్తాపడ్డాడని విమర్శించారు. అప్పుడు నియంత్రిత పంటల సాగు వద్దని చెప్పినా వినకుండా.. ఇప్పుడు యూ టర్న్ తీసుకున్న కారుగా మిగిలిపోయారని తెలిపారు.
శేష జీవితం చర్లపల్లి జైలులో..
మెట్రో రైలు కోసం ఏదేదో చెప్పి మూడేళ్లు ఆలస్యం చేసి 4వేల కోట్ల భారం మోపాడని పొన్నాల ఆరోపించారు. గతంలో రైతుల వద్ద నుంచి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు రైతులకు అన్యాయం చేశాడని విమర్శించారు. సీఎం అవివేకం, అహంకారం, అనాలోచిత నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం చర్యలతో రాష్ట్ర రైతాంగం ప్రమాదంలో పడుతుందన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడాన్ని ఎండగడుతామన్నారు. కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైల్లో ఉంటుందని జోస్యం చెప్పారు.
ఇదీ చూడండి: సాగు చట్టాల విషయంలో సీఎం యూటర్న్: బండి సంజయ్