ఇవీ చూడండి:నేడు రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రాక
హస్తాన్ని వీడారు... కమలానికి జై కొట్టారు - RESIGNATION
కాంగ్రెస్‌కు ఒక షాక్ నుంచి తేరుకునేలోపే ఇంకో షాక్ ఇచ్చేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలు వరుసగా పార్టీలు ఫిరాయించిన అంశం నుంచి బయటపడేలోపే... ఎమ్మెల్సీగా పదవి ముగించుకున్న పొంగులేటి హస్తానికి రాజీనామా చేశారు. కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.
హస్తానికి రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాహుల్‌గాంధీకి పంపారు. అసెంబ్లీ, ఎమ్మెల్సీ, లోక్‌సభ టికెట్ల కేటాయింపు అంశాల్లో కాంగ్రెస్ రాష్ట్ర నేతల తీరుపై పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీట్ల కేటాయింపులో ధనప్రభావం తీవ్రంగా ఉందని ఆరోపించారు. భాజపాలో చేరేందుకు సుముఖత చూపిస్తున్న పొంగులేటి ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటలకు మోదీని కలువనున్నారు.
ఇవీ చూడండి:నేడు రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రాక
Last Updated : Mar 31, 2019, 3:10 PM IST