మైసమ్మ కాపాడేదెవరమ్మా
- ప్రాంతం: మూసాపేట
- విస్తీర్ణం: 84.02 ఎకరాలు
- ఆక్రమణలు: 9.38 ఎకరాలు
- పరిస్థితి: ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ ఆక్రమణలకు గురైంది. ఏకంగా కాలనీయే ఏర్పాటైంది. మురుగు వచ్చి చేరుతోంది.
- ఏం చేయాలి: చెరువు కట్టను బలోపేతం చేసి, చుట్టూ రక్షణ కంచె నిర్మించాలి. మురుగునీటిని శుద్ధి చేసి వదలాలి.
బండ్లగూడ బాధలివి
- ప్రాంతం: బండ్లగూడ
- విస్తీర్ణం: 36 ఎకరాలు
- ఆక్రమణలు: 20 ఎకరాలు
- పరిస్థితి: ఎఫ్‌టీఎల్‌లో ఏకంగా మూడు కాలనీలు వెలిశాయి. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా 300 ఇళ్లు మునిగిపోతున్నాయి. అయ్యప్పకాలనీ, మల్లికార్జున్‌నగర్ ఫేజ్-1, 2, త్యాగరాయనగర్‌కు ముప్పు ఏర్పడుతోంది.
- ఏం చేయాలి: చెరువు కట్టను బలోపేతం చేయాలి. అలుగు పారేందుకు ప్రత్యేక కాల్వ తవ్వాలి. మురుగునీరు నేరుగా కలవకుండా ఎస్టీపీ నిర్మించాలి.
నల్ల తాచులు
- ప్రాంతం: ఉప్పల్
- విస్తీర్ణం: 100 ఎకరాలు
- ఆక్రమణలు: 40 ఎకరాలు
- పరిస్థితి: ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ ఆక్రమణకు గురైంది. నాచారం చెరువు నుంచి వచ్చే నాలా కబ్జాకు గురైంది. సుందరీకరణ పేరిట కట్ట నిర్మించి చెరువుకు మరింత ఇబ్బందికరంగా మార్చారన్న ఆరోపణలున్నాయి.
- ఏం చేయాలి: మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేశాకే చెరువులోకి వదలాలి. చెరువు ప్రాంతాన్ని కొంతమేర వదిలేసి కట్ట నిర్మించారు. కొత్తగా ఆక్రమణలు పుట్టుకురాకుండా ఆ ప్రాంతాన్ని పరిరక్షించాలి.
ఈస్ట్‌ఆనంద్‌బాగ్
- ప్రాంతం: ఈస్ట్‌ఆనంద్‌బాగ్
- విస్తీర్ణం: 60 ఎకరాలు
- ఆక్రమణలు: 40 ఎకరాలు
- పరిస్థితి: మురుగు చేరి, దుర్వాసన వెలువడుతోంది. ఆక్రమణల వల్ల, దిగువున ఉన్న షిర్డీనగర్ తదితర ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి.
- ఏం చేయాలి: ఎస్టీపీ నిర్మాణ ప్రతిపాదన పట్టాలెక్కించాలి. అలుగు పారేందుకు వీలుగా బాక్స్ డ్రెయిన్ నిర్మించాలి.
పల్లె సమస్య పట్నానికి
- ప్రాంతం: మైలార్‌దేవ్‌పల్లి
- విస్తీర్ణం: 39 ఎకరాలు
- ఆక్రమణలు: 24 ఎకరాలు
- పరిస్థితి: క్రిస్టల్ గార్డెన్ కాలనీ, బండ్లగూడ, అలీనగర్ ముంపు బారిన పడుతున్నాయి. కట్ట బలహీనంగా ఉంది. గతేడాది వరదనీరు ముంచెత్తి అలీనగర్‌కు చెందిన 9 మంది కొట్టుకుపోయారు.
- ఏం చేయాలి: కట్టడాలు నిర్మించకుండా చర్యలు తీసుకోవాలి. కట్టను బలోపేతం చేయాలి.
సున్నం మిగిలింది
- ప్రాంతం: అల్లాపూర్
- విస్తీర్ణం: 24.12 ఎకరాలు
- ఆక్రమణలు: 9.11 ఎకరాలు
- పరిస్థితి: ఎఫ్‌టీఎల్‌లో 68 నివాసాలున్నాయి. వర్షాలొస్తే అల్లాపూర్‌లోని ఇళ్లు మునుగుతున్నాయి.
- ఏం చేయాలి: చెరువు కట్టను పటిష్ఠం చేయాలి. గతంలో కొంతమేర వేసి వదిలేసిన రక్షణ కంచెను పూర్తి చేయాలి.
అప్పా.. అవస్థ తీరేదెప్పుడప్పా
- ప్రాంతం: గగన్‌పహాడ్
- విస్తీర్ణం: 14 ఎకరాలు
- ఆక్రమణలు: 10 ఎకరాలు
- పరిస్థితి: చెరువులో లేఅవుట్ వేసి ఇళ్లు నిర్మించారు. గతేడాది చెరువు నీరు పొంగి బెంగళూరు జాతీయ రహదారిని ముంచెత్తింది. నలుగురు కొట్టుకుపోయి చనిపోయారు. రెండు వారాల కిందట చెరువుకు గండి పడి నీరు హైవేను ముంచెత్తింది.
- ఏం చేయాలి: చెరువులో ఆక్రమణలు తొలగించాలి. అలుగు పారే నీరు హైవేపైకి రాకుండా భూగర్భ వరదకాల్వ తవ్వాలి.
చినరాయుని కష్టం
- ప్రాంతం: అల్వాల్
- విస్తీర్ణం : 17.25 ఎకరాలు
- ఆక్రమణలు : 5 ఎకరాలు
- పరిస్థితి: చెరువు నిండితే ఆనందరావునగర్, జానకీనగర్, జోషినగర్, దినకర్‌నగర్‌లో ముంపునకు గురవుతున్నాయి. మురుగు నేరుగా చెరువులో కలుస్తోంది.
- ఏం చేయాలి: చెరువుకు అనుసంధాన నాలాలు పునరుద్ధరించాలి. బాక్స్ డ్రెయిన్లు నిర్మించాలి.
జల్‌పల్లి ఇబ్బంది మళ్లీ మళ్లీ
- ప్రాంతం: జల్‌పల్లి
- విస్తీర్ణం: 299 ఎకరాలు
- ఆక్రమణ: 100 ఎకరాలు
- పరిస్థితి: చెరువు ఎఫ్‌టీఎల్‌లోనే 1800 వరకు అక్రమ కట్టడాలు పుట్టుకొచ్చాయి. నాలాను ఆక్రమించి నిర్మించడంతో నీరు పారడం లేదు. కాల్వలు కుంచించుకుపోయాయి.
- ఏం చేయాలి: చెరువు కట్టను పటిష్ఠం చేయాలి. మురుగు చేరకుండా కట్టడి చేయాలి. నాలాలను పునరుద్ధరించాలి.
పేరుకే పెద్ద
- ప్రాంతం: రామంతాపూర్
- విస్తీర్ణం: 26 ఎకరాలు
- ఆక్రమణ: 13 ఎకరాలు
- పరిస్థితి: ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. రవీంద్రనగర్, సాయిచిత్రనగర్, లక్ష్మీనగర్‌కాలనీ, మహేశ్వరినగర్ కాలనీలకు ముంపు ఏర్పడుతోంది.
- ఏం చేయాలి: పెద్దచెరువు నుంచి చిన్నచెరువుకు నీరు పారేలా కాల్వ నిర్మించాలి. నాలాలోని ఆక్రమణలను తొలగించాలి.
గ్రేటర్‌లో చెరువుల స్వరూపం
- మొత్తం చెరువులు 185
- సుందరీకరణకు ఎంపిక చేసినవి 127
- కేటాయించిన నిధులు రూ.407.30 కోట్లు
- ఇప్పటికే ఖర్చుచేసింది రూ.218కోట్లు
- సుందరీకరణ పూర్తయినవి 48
ఇదీ చూడండి: Minister KTR on ponds: 'చెరువులను పరిరక్షిస్తాం... ఆక్రమణలు జరగనివ్వం'