రాాష్ట్రంలో పాలిటెక్నిక్ సీట్లు భారీగా మిగిలిపోయాయి. ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ఏర్పాటు చేసినప్పటికీ.. మూడో వంతు సీట్లు భర్తీ కాలేదు. ప్రత్యేక విడత కౌన్సెలింగ్లో భాగంగా సోమవారం 4,206 మందికి సీట్లు కేటాయించారు.
రాష్ట్రంలో 132 పాలిటెక్నిక్ కాలేజీల్లో 31,792 సీట్లు ఉండగా.. వాటిలో 67.24 శాతం 21,377 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 10,415 సీట్లు మిగిలాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు 54 ఉండగా.. వాటిలో 39 కాలేజీల్లో సీట్లన్నీ భర్తీ కాగా.. ప్రైవేట్ కాలేజీలు 77 ఉండగా.. కేవలం నాలుగింటిలోనే సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ప్రత్యేక విడత కౌన్సెలింగ్లో సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 14లోగా కాలేజీల్లో చేరాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ఈనెల 15 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభంకానున్నాయని వెల్లడించారు.
ఇదీ చూడండి: రెండు నెలలకోసారి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించాలి: హరీశ్