ETV Bharat / state

Hyderabad : బీ అలర్ట్.. హైదరాబాదీలు బయటికొస్తున్నారా? జర జాగ్రత్త! - కాలుష్యం పర్యావరణం

Pollution in hyderabad: హైదరాబాద్​లో ఓ వైపు చలి వణికిస్తోంది. మరోవైపు కాలుష్య(Pollution in hyderabad) కోరలు కమ్మేస్తున్నాయి. స్వచ్ఛమైన గాలి కలుషితమై.. అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. సెప్టెంబర్​తో పోల్చితే అక్టోబర్​లో అన్ని ప్రాంతాల్లో దుమ్ము కణాల తీవ్రత భారీగా పెరిగినట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.

Pollution in hyderabad, hyderabad pollution news
హైదరాబాద్​లో కాలుష్యం, భాగ్యనగరంలో కాలుష్యం కోరలు
author img

By

Published : Nov 14, 2021, 9:38 AM IST

ఓ వైపు చలి పెరుగుతుంటే.. మరోవైపు కాలుష్యం కోరలు చాస్తోంది. దేశ రాజధానిలోనే కాదు రాష్ట్ర రాజధానిలోనూ రోజురోజుకూ కాలుష్యం(Pollution in hyderabad) ఇబ్బందికర స్థాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా స్వచ్ఛమైన గాలిని కలుషితం చేసి అనారోగ్య సమస్యలకు కారణమయ్యే ధూళి కణాలు (పీఎం 10, పీఎం 2.5..) ‘దుమ్ము’ రేపుతున్నాయి. సెప్టెంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లో అన్ని ప్రాంతాల్లోనూ వీటి తీవ్రత భారీగా పెరిగినట్లు తాజాగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(TSPSB) తేల్చింది. పీఎం 2.5 కంటికి కనిపించదు. గాలి పీల్చగానే ఊపిరితిత్తుల్లోకి చేరి అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. వెంట్రుక మందంలో అయిదోవంతుండే పీఎం 10.. స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తుంది. ఆ వాతావరణంలో ఎక్కువ సేపు గడిపితే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాలుష్య కోరలు

నాలుగు చోట్ల ‘100’ మార్కు...

సెప్టెంబర్‌తో పోల్చితే అక్టోబర్‌లో పీఎం 10 తీవ్రత నాలుగు చోట్ల ‘100’ మార్కును దాటేసింది. సున్నిత ప్రాంతమైన జూపార్క్‌(highly air polluted areas in hyderabad) దగ్గర పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పీఎం 2.5 విషయానికొస్తే సనత్‌నగర్‌లో అత్యధికంగా పెరిగింది. అక్కడ నెలలోనే 32 ఎంజీలు పెరిగింది. హెచ్‌సీయూ దగ్గర 7 ఎంజీల నుంచి 37 ఎంజీలు, చార్మినార్‌లో 17 ఎంజీల నుంచి 25 ఎంజీలు, జీడిమెట్లలో 18 ఎంజీల నుంచి 28 ఎంజీలకు పెరిగినట్లు లెక్క తేల్చారు.

ఉష్ణోగ్రతలు తగ్గడంతోనే...

ఉష్ణోగ్రతలు తగ్గడంతోనే ధూళి కణాల తీవ్రత పెరిగినట్లు పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. వేసవిలో వాతావరణం(causes of air pollution in hyderabad) పొడిగా ఉంటుంది. గాల్లోకి వెలువడిన కాలుష్య ఉద్గారాలు అటు.. ఇటు ప్రయాణిస్తుంటాయి. అదే శీతాకాలం విషయానికొస్తే మంచు ఉండటం వల్ల ఎటూ కదలకుండా భూమిపై కొద్ది మీటర్ల ఎత్తులోనే ఉండిపోతాయి.

ధూళి కణాలు ఇలా..

మరోవైపు దేశ రాజధానిలో కాలుష్యం పెరగడంతో రహదారులపై వీలైనంత వాహన సంచారం తగ్గించేందుకు కేజ్రీవాల్‌ సర్కారు వారం రోజులపాటు విద్యాసంస్థలు మూసివేసేందుకు ఆదేశాలిచ్చింది. నాలుగు రోజులపాటు నిర్మాణ పనులపై ఆంక్షలు విధించింది. అవసరమైతే లాక్‌డౌన్‌ పెట్టేందుకు సైతం సిద్ధమవుతోంది. దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ తీవ్రమవుతోంది. దీపావళి, పొరుగు రాష్ట్రాల్లో పంటవ్యర్థాలు దహనం చేయడం వల్ల దిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. దేశరాజధానిలో వాయునాణ్యత సూచీ 432కి చేరినట్లు గాలి నాణ్యత పరిశోధన వ్యవస్థ వెల్లడించింది. దిల్లీ యూనివర్సిటీ నార్త్​ క్యాంపస్​.. 466 పాయింట్లతో అత్యంత కలుషితమైన ప్రాంతంగా నమోదైంది. ఐఐటీ దిల్లీ ప్రాంతంలో(441), లోధి రోడ్డు(432), పూసా రోడ్డు(427) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దిల్లీ విమానాశ్రయం, ఇండియా గేట్ ప్రాంతాల్లో గాలి కాలుష్యం పెరిగిపోయి ఆకాశంలో పొగమంచు పొరలా ఆవరించింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దిల్లీలో వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు కేజ్రీవాల్‌ సర్కారు ఇప్పటికే చర్యలు చేపట్టింది. రహదారుల మీద నీటిని చల్లేందుకు వాటర్ ట్యాంకర్లను మోహరించింది. స్మాగ్ గన్స్‌ను ఏర్పాటు చేసి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది.

ఇదీ చదవండి: children's day 2021: చిల్డ్రన్స్ డే స్పెషల్.. ఆట.. మాట.. ఆవిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.