ETV Bharat / state

ఐసోలేషన్‌ కిట్‌.. అందరికీ దక్కదు.. అన్నీ ఉండవు..! - isolation kit issues

హైదరాబాద్‌లో పాజిటివ్‌ వచ్చిన బాధితులు సుమారు 70 శాతం ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వీరి కోసం ప్రభుత్వం అందిస్తోన్న ఐసోలేషన్‌ కిట్లలో క్షేత్రస్థాయి రాజకీయాలు బాధితుల పాలిట శాపంగా మారుతున్నాయి. హోమ్‌ ఐసోలేషన్‌ బాధితులకు ఇవ్వాల్సిన కిట్లను స్థానిక నేతలు పంచుతున్నారు. వాటిని ప్రచారానికి వాడుకుంటున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ బాధ్యతారాహిత్యం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

isolation kit
isolation kit
author img

By

Published : Jul 21, 2020, 6:05 AM IST

Updated : Jul 21, 2020, 10:09 AM IST

  • హైదరాబాద్‌ మన్సూరాబాద్‌ డివిజన్‌లో నివసించే ఓ ప్రైవేట్‌ ఉద్యోగి ఈనెల 12న ఉస్మానియా ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నాడు. ఫలితం ఆలస్యం అవుతుండటంతో అక్కడి సిబ్బందిని సంప్రదిస్తే కరోనా పాజిటివ్‌ అని చెప్పారు.ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాడు. రెండు, మూడు రోజులు గడిచినా పరీక్ష సందేశం రాలేదు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఫోన్‌ చేసి ఇంటికి జియోట్యాగింగ్‌ చేస్తున్నామని చిరునామా అడిగారు. రెండు రోజుల తర్వాత స్థానిక నేత ఒకరు ఐసోలేషన్‌ కిట్‌ కావాలా అంటూ బేరసారాలు నడిపించారు. కిట్‌ జీహెచ్‌ఎంసీ ఇవ్వాలి కదా అని బాధితుడు అధికారులను ఫోన్‌లో సంప్రదించగా స్పందన లేదు.
  • జూబ్లీహిల్స్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌(27)ది ఇదే పరిస్థితి.

నగరంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. పాజిటివ్‌ వచ్చిన బాధితులు ఆసుపత్రుల్లో చేరేందుకు వీల్లేక సుమారు 70 శాతం ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంటున్నారు.

వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం అందిస్తోన్న ఐసోలేషన్‌ కిట్లలో క్షేత్రస్థాయి రాజకీయాలు బాధితుల పాలిట శాపంగా మారుతున్నాయి. జీహెచ్‌ఎంసీ అందించాల్సిన కిట్లు ఓ పార్టీ నేతల చేతుల్లోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి తమకు నచ్చిన, వారి దృష్టికి వచ్చిన బాధితులకు మాత్రమే అవి అందుతున్నాయి. సాధారణ రోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

పంచాలి.. ఫొటో దిగాలి

గ్రేటర్‌లో కరోనా బాధితులను క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. స్థానిక నేతలు ఫోన్లు చేసి చెప్తేనే కిట్లు, తదితర ఏర్పాట్లు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

హోమ్‌ ఐసోలేషన్‌ బాధితులకు ఇవ్వాల్సిన కిట్లను స్థానిక నేతలు ఫొటోలు దిగుతూ పంచుతున్నారు. వాటిని ప్రచారానికి వాడుకుంటున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ బాధ్యతారాహిత్యం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

అన్నీ ఉండవు..!

ప్రస్తుతం బాధితులకు అందిస్తున్న కిట్లలో వివిధ రకాల మాత్రలు, గ్లౌసులు, శానిటైజర్‌, మాస్కులతోపాటు వాడాల్సిన తీరు చెప్పే పుస్తకం.. ఇలా మొత్తం 12 వస్తువులు ఉండాలి.

కానీ చాలా వరకు కిట్లలో అన్ని వస్తువులు ఉండట్లేదని అవి అందిన బాధితులు చెబుతున్నారు. ఈ విషయంపై కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా అటు నుంచి సరైన స్పందన లేదని వాపోతున్నారు. స్థానిక సిబ్బంది నుంచి కనీస సంప్రదింపులు కరవయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రేటర్‌ పరిధిలో హోమ్‌ ఐసోలేషన్‌ కిట్‌ కోసం బాధితులు సంప్రదించాల్సిన నంబరు : 040-2111 1111

ఇదీ చదవండి: నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్​

Last Updated : Jul 21, 2020, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.