ETV Bharat / state

Komatireddy son Wedding: కోమటిరెడ్డి కుమారుడి పెళ్లిలో కేకే, ఈటల ఆత్మీయ ఆలింగనం - Komatireddy son wedding in hyderabad

Komatireddy son Wedding: హైదరాబాద్​లో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన కుమారుడి వివాహా వేడుకను నిర్వహించారు. నూతన దంపతులను ఆశీర్వదించడానికి పలు పార్టీల రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెరాస ఎంపీ కేకే, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితర నాయకులు హాజరయ్యారు.

Komatireddy son Wedding
Komatireddy son Wedding
author img

By

Published : Dec 12, 2021, 7:21 PM IST

Updated : Dec 13, 2021, 3:23 PM IST

కోమటిరెడ్డి కుమారుడి పెళ్లిలో కేకే, ఈటల ఆత్మీయ ఆలింగనం

Komatireddy son Wedding: ఒక్క ఆలింగనం వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో చెప్పింది. కొన్నేళ్ల పాటు ఒకే పార్టీలో ఉండి కలిసి పనిచేశారు. సీనియర్, జూనియర్ అనే భేదాలకు ఏనాడు వెళ్లలేదు. తెలంగాణ రాష్ట్ర సాకారంలో పాలుపంచుకున్నారు. కానీ కాలం మారింది. అనుకోని విధంగా వారిద్దరి పార్టీలు వేరయ్యాయి. ఒకే పార్టీలో ఉన్నప్పుడు వారిద్దరి మధ్య ఏ విధమైన అనుబంధముందో... ఇప్పుడు కూడా అలానే ఉందనిపించింది. ఆ ఆలింగనం వారి మధ్య అనుబంధం ఎలాంటిదో చాటి చెప్పింది. ఎంతకీ వారి ఇద్దరు ఎవరంటే...!

munugodu MLA son wedding: మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన కుమారుడి వివాహా వేడుకను హైదరాబాద్​లో నిర్వహించారు. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి పలువురు రాజకీయ ప్రముఖులను ఆయన ఆహ్వానించారు. వారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. ఆయన కూడా దంపతులను ఆశీర్వదించడానికి విచ్చేశారు.

kk and etela: కల్యాణ మండపంలోకి రాగానే తెరాస సీనియర్ నాయకులు, ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ కే కేశవరావు తారసపడ్డారు. అంతే ఈటలను చూసిన కేకే... ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. నవ్వుతూ పలకరించారు. ఇద్దరి మధ్య సంభాషణ సరదాగా సాగింది. కేకే తన మాస్క్​తో ఈటలను సరదాగా కొట్టడం అక్కడి వారిలో నవ్వులు పూయించింది.

ఆశీర్వదించిన రేవంత్...

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు సీనియర్ ఉపాధ్యక్షులు వేంనరేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Dec 13, 2021, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.