ETV Bharat / state

Political Parties Focus on Hyderabad : హైదరాబాద్‌కు అధినేతలు రావాలి ప్రచారం హోరెత్తాలి భాగ్యనగర ఓటర్ల మనసు గెలుచుకోవాలి

Political Parties Focus on Hyderabad Election Plans 2023 : హైదరాబాద్​లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలో అధికార పీఠంపై కూర్చోవాలంటే అత్యధిక సీట్లు ఉన్న భాగ్యనగరంలో ఓటర్ల మనసు గెల్చుకోవాల్సిందే. అందుకే పార్టీలు ప్రత్యేకించి నగర ఎన్నికల ప్రణాళికలపై ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా రాజధానిలో ఈ నెల రెండోవారం నుంచి అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ సభలకు ఏర్పాట్లు చేసుకున్నాయి.

Telangana Assembly elections 2023
Political Parties Focus on Hyderabad Election Plans
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2023, 2:52 PM IST

Political Parties Focus on Hyderabad Election Plans : రాజధాని పరిధిలో అధిక స్థానాలను దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ప్రధాన పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. హైదరాబాద్ పరిధిలో మాత్రం ఎటువంటి సభలు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. నియోజకవర్గాల్లో కూడా పెద్దగా ప్రచార హడావుడి కనిపించడం లేదు. దీనికి కారణం ఉందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు.

ఈ నెల రెండో వారం నుంచి రాజధానిలో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ సభలపై దృష్టిసారించనున్నాయి. రాజకీయ పార్టీలు రెండువారాల పాటు వరుసగా బహిరంగ సభలు, కార్నర్‌ మీటింగ్‌లు, ర్యాలీలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. ఈ సభలకు అనుగుణంగా జనాల సేకరణపై దృష్టిపెట్టాలని అభ్యర్థులకు అగ్రనేతలు సూచించినట్లు సమాచారం.

BRS Target On Greater Hyderabad : గ్రేటర్ హైదరాబాద్‌పై.. బీఆర్​ఎస్​ ఫోకస్

BRS Election Campaign 2023 : బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. రాజధానిలో ఈసారి ఎలాగైనా 20 సీట్లకు పైగా గెలవాలని ఆపార్టీ వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా నగరంలో ప్రచారం పరంగా ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ అభ్యర్థులు, సీనియర్‌ నేతలతో మాట్లాడారు. ఈ నెల రెండోవారం తరువాత హైదరాబాద్ నలువైపులా నాలుగైదు బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటన్నింటిలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. నవంబర్ చివరి వారం రోజులు అన్ని నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన సభలు, మూడోవారంలో ర్యాలీలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించనున్నారు.

Congress Election Campaign 2023 : కాంగ్రెస్‌ పార్టీ సైతం నగరంలో ధీటుగా ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల రెండోవారం తరువాత సరూర్‌నగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు తెలిపారు. ఈ నెల 27లోగా ఏడు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌, ప్రియాంకలు ఈ సభలకు రానున్నారని అంటున్నారు. హైదరాబాద్​లో​ సోనియా గాంధీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల్లో జోష్ నింపాలనుకుంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల కార్నర్‌ మీటింగ్‌లు జరుగుతుండగా.. బుధవారం రోజు షాద్‌నగర్‌లో జరగనున్న కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్‌గాంధీ పాల్గొననున్నారు.

BJP Election Campaign 2023 : బీజేపీ ఇంకా నగరంలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. మరో రెండ్రోజుల్లో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అంటున్నారు. దీంతో ప్రచార సభలపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా రాజధాని పరిధిలో లక్షమందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అభ్యర్థుల ప్రకటన వచ్చిన తర్వాత తమ ప్రచార వ్యూహం సిద్ధమవుతుందని ఆ పార్టీ నేతలు తెలుపుతున్నారు.

Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో ప్రచారాల జోరు.. తగ్గేదే లే అంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

Congress Focus on Greater Hyderabad : గ్రేటర్​ హైదరాబాద్​ అసెంబ్లీ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.