ETV Bharat / state

ఊపందుకున్న ఎన్నికల ప్రచారం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు

Political Parties Election Campaign in Telangana : ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచార పర్వంలో మునిగిపోయాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళుతూ ప్రచార హోరు పెంచింది. పదేళ్ల సంక్షేమపాలనే ప్రధానాస్త్రంగా బీఆర్​ఎస్​ దూసుకెళుతుంది. బీజేపీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ బీఆర్​ఎస్​ వైఫల్యాలను బలంగా ఎత్తి చూపుతూ ఓట్లును అభ్యర్థిస్తున్నారు.

Telangana Assembly Elections
Political Parties Election Campaign in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 9:22 PM IST

ఊపందుకున్న ఎన్నికల ప్రచారం- ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల పాట్లు

Political Parties Election Campaign in Telangana : రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల ప్రచారాల పర్వం ఊపందుకుంది. ప్రధాన నేతలు బహిరంగసభ(Telangana Election Campaign)లతో ముందుకెళుతుంటే.. టిక్కెట్‌ వచ్చిన నాయకులు నియోజకవర్గాల్లో ప్రచారాలను ముమ్మరం చేశారు. మేడ్చల్ బీఆర్​ఎస్​ అభ్యర్థి కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ప్రచారంలో భాగంగా.. మేడ్చల్‌లోని మసీదుల్లో ప్రార్థనల అనంతరం ప్రచారం చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో పూజల తర్వాత డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో.. బీఆర్​ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్​ఎస్(BRS Door to Door Election Campaign)​కు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

రాష్ట్రంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం రెండో రోజూ సెంచరీ దాటేశాయిగా

Telangana Assembly Elections 2023 : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సురేందర్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల చెంతకు వెళుతున్నారు. జగిత్యాలలో సంజయ్‌కుమార్‌.. ఆయన కుటుంబ సభ్యులు సైతం ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని పలు గ్రామాల్లో తుంగతుర్తి బీఆర్​ఎస్​ అభ్యర్థి గాదరికిశోర్‌ కుమార్ ప్రచారం నిర్వహించారు.

Congress Election Campaign : హైదరాబాద్​లోని ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజు నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. రాంనగర్ చేపల మార్కెట్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఆయన.. స్థానిక వ్యాపారస్తులను కలిసి కమలం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ప్రచారంలో భాగంగా హస్తినాపురం డివిజన్‌లోని పర్యటించారు. విరాట్​నగర్​లో ఇంటింటికి తిరుగుతూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

సెంటిమెంట్​ రిపీట్ కోనాయిపల్లి వెంకన్న సన్నిధిలో నామినేషన్​ పత్రాలకు ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్

BJP Election Campaign : నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీహరిరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.. పొదెం వీరయ్య పట్టణంలోని చర్చి, మసీదు, రామాలయాల్లో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం.. ముదిగొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి భట్టి విక్రమార్క భారీ జన సందోహం మధ్య ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ తనను గెలిపించాలని అభ్యర్థించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టెం పర్నికా రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. స్థానిక హనుమాన్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

'మంత్రి కేటీఆర్​ను ముఖ్యమంత్రిని చేసేందుకే ఈటలను బీఆర్​ఎస్​ నుంచి బయటకు పంపంచారు'

పవన్​కల్యాణ్​ లాంటి తెలంగాణ వ్యతిరేకితో బీజేపీ చేతులు కలిపింది ద్రోహులంతా ఒక్కటవుతున్నారు : హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.